కంచికచర్ల: దొనబండ చెక్‌పోస్టు వద్ద గందరగోళం

23 Mar, 2020 08:58 IST|Sakshi

సాక్షి, కృష్ణా: కంచికచర్ల మండలం దొనబండ చెక్‌పోస్టు వద్ద గందరగోళం నెలకొంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు అనుమతి లేదంటూ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. తెలంగాణలో అనేక చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయని వెళ్ళటం కుదరదని వాహనదారులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాము వెళ్లి తీరాల్సిందే అంటూ పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా కొన్ని వాహనాలను అనుమతించారు. ఈ నేపథ్యంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణ మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.(తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు