పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌పై వేటు

5 Nov, 2018 11:16 IST|Sakshi
పలమనేరు మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల

అసభ్యంగా ప్రవర్తించిన అధ్యాపకుడి సస్పెన్షన్‌

ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా మహ్మమద్‌

చిత్తూరు  ,పలమనేరు: పట్టణ సమీపంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ విశ్వనాథరెడ్డిపై ఎట్టకేలకు వేటుపడింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్‌ అధ్యాపకుడు శ్రీధర్‌ను సైతం సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీధర్‌ అనే అధ్యాపకుడు సెప్టంబరు 26న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో వారు తరగతులను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ సూర్యుడు విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్‌ అక్కడి మహిళా అధ్యాపకులను వేధిస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. ఆర్జేడీ నివేదికను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు పంపారు. దీంతో ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకుడిని సస్పెండ్‌ చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ పండాదాస్‌ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా మహ్మద్‌
కళాశాలకు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌గా సివిల్‌ ఇంజినీరింగ్‌ హెచ్‌వోడీగా పనిచేస్తున్న మహ్మద్‌ను నియమించారు. ఆయన శనివారం చార్జ్‌ తీసుకున్నారు. ఇప్పటికే కళాశాల హాస్టల్‌ మెస్‌ విషయంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల పాలన పూర్తిగా గాడితప్పింది. కొందరు అధ్యాపకులు సమయపాలన పాటించడం లేదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపాల్‌ ఈ సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు