AP CM YS Jagan Nagari Meeting: విద్యాదీవెన పేదింటి పిల్లల భవిష్యత్తు మారుస్తుంది: సీఎం జగన్‌

28 Aug, 2023 15:27 IST|Sakshi

సాక్షి, నగరి, చిత్తూరు: విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్‌ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ, 15,600 కోట్లు అందించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెన కింద 26,98,728 మంది పిల్లలకు మంచి చేస్తూ రూ. 11, 317 కోట్లు అందించామని పేర్కొన్నారు. నేడు 8, 44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.

విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్థికి రూ, 15 వేల అందించామని తెలిపారు. స్కూళ్లు ప్రారంభించే నాటికే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నామని. బైజూస్‌ కంటెంట్‌తో విద్యార్థులకు బోధన అందిస్తున్నామన్నారు.  పేదరికం విద్యార్థుల చదవులకు అడ్డు రాకూడదన్నారు. విద్యాసంస్థల్లో అక్రమాలుంటే 1902కు కాల్‌ చేయాలని తెలిపారు.

సీఎం జగన్‌ ప్రసంగం.. ఆయన మాటల్లోనే!
►ప్రతి పేద కుటుంబం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్‌లో ఇంకా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. 
►ప్రతి అడుగూ కూడా ప్రతి పిల్లాడినీ చేయి పట్టుకొని పెద్ద చదువులు చదివించి తద్వారా పిల్లలు పేదరికం నుంచి బయటకు రావాలని అడుగులు వేస్తున్నాం. 
► 17-20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు నేటి తరం మరో 80 ఏళ్ల పాటు ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలో బతకాలంటే వాళ్ల ప్రయాణాన్ని జీవిత ప్రమాణాన్ని ఈ రెంటింటినీ మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని నమ్మాం.  
►పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తున్నాం. 
►ప్రతి పేద కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఫీజులు పూర్తిగా తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం జగనన్న విద్యా దీవెన.
► భోజనం, వసతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం.

3 నెలలకొసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి.
►ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ పిల్లాడికి 15 వేలు, డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ పిల్లలకు సంవత్సరానికి 20 వేల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ  చేస్తున్నాం. 
►జగనన్న వసతి దీవెన అనే ఒక్క పథకం ద్వారా మాత్రమే రూ.4,275 కోట్లు పెద్ద చదువుల కోసం తల్లుల ఖాతాల్లోకి జమ చేశాం. 
►కేవలం ఈ రెండు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 4 సంవత్సరాల కాలంలోనే రూ.15,600 కోట్లు ఇచ్చాం. 
►ఫీజులు మొత్తం నేరుగా కాలేజీలకే ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోంది.
►ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాలి. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలి. 
► ఆ కాలేజీలో విద్యా బోధన బాగాలేకున్నా, వసతులు సరిగ్గా లేకున్నా వాటిపై ఆ కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తున్నాం. 

ఫిర్యాదుల కోసం 1902కు కాల్‌ చేయండి
►ఏవైనా వసతులు బాగోలేకున్నా, బోధన బాగోలేకున్నా, పిల్లలకు ఇవాళ ఇస్తున్న డబ్బు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కాక కాలేజీ యాజమాన్యాలు వేరే  రకంగా ఇంకో ఫీజు ఇంకొకటని ఫీజులు అడిగితే మాత్రం 1902కు ఫోన్ చేయండి. 
► జగనన్నకు చెబుదాంకు ఫోన్ చేయండి.
► ముఖ్యమంత్రి కార్యాలయం, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది. 
► ఇటువంటి తప్పిదాలు జరగకుండా కట్టడి చేస్తుంది. యాక్షన్ తీసుకుంటుంది. 

3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్
►4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం. 
►తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా పిల్లలను చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15 వేల చొప్పున అమ్మ ఒడి ఇస్తున్నాం. 
►ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ అన్నీ కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే రోజు ఇస్తున్నాం. 
► స్కూళ్లను సమూలంగా రూపు రేఖలు మారుస్తూ, శిథిలావస్థలో ఉన్న స్కూళ్లకు గొప్ప వైభవం తీసుకొచ్చేందుకు నాడు-నేడు తీసుకొచ్చాం. 
► గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, బైలింగువల్ టెక్ట్స్ బుక్ లు తీసుకొచ్చాం. 
►బైజూస్ కంటెంట్‌తో కూడా పిల్లల కరికులమ్‌ను అనుసంధానం చేశాం.
► 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం.

8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్‌
►మూడో తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ బోధన వచ్చే ఏడాది నుంచి ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాం. 
► సీబీఎస్ఈ సిలబస్‌తో ప్రారంభించి ఐబీ, ఐజీసీఎస్ఈ  ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ దిశగా మన గవర్నమెంట్ బడులు వేగంగా అడుగులు వేస్తున్నాం. 
► ఇంతకు ముందు రాష్ట్రంలో చూడని విధంగా, నాడు-నేడు కింద పూర్తి అయిన బడుల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములు డిజిటలైజ్ చేస్తున్నాం.
►ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 
►63 వేల క్లాస్ రూములకు సంబంధించి 31 వేల క్లాస్ రూముల్లో ఏర్పాటయ్యాయి. 
►డిసెంబర్ నాటికల్లా మిగిలిన క్లాస్ రూముల్లో ఏర్పాటవుతాయి. 
► 8వ తరగతి పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా అనే తాపత్రయపడుతూ ట్యాబ్స్ ఇచ్చేందుకు మొదలుపెట్టాం. 

స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద
►గవర్నమెంట్ స్కూళ్లలో రోజుకో మెనూతో గోరుముద్ద కింద విపరీతమైన మార్పులు తెచ్చాం. 
►పిల్లలు తింటున్న తిండి గురించి ఆలోచించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే అది మీ అన్న పరిపాలనలోనే.
► సంపూర్ణ పోషణ, స్కూళ్లలో ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ తీసుకొచ్చాం.
► చదువులను ప్రోత్సహిస్తూ వివాహానికి ముందే 10 పాసై ఉండాలనే నిబంధన తీసుకొస్తూ వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేస్తున్నాం.

►ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదవాలని పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో విద్యా దీవెన తీసుకొచ్చాం. 
► వసతి దీవెన తీసుకొచ్చాం. 
► ప్రపంచంతో పోటీ పడుతూ విదేశాల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం కోటీ 25 లక్షల దాకా ఫీజులను చెల్లిస్తున్న  ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. మన రాష్ట్రంలో తప్ప. 
►కరిక్యులమ్‌లో ఆన్ లైన్ వర్టికల్స్ తెచ్చాం. తప్పనిసరి ఇంటర్నషిప్ తెచ్చాం. 
►కేవలం ఈ పథకాల మీద మీ అన్న ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.69,296 కోట్లు. 

మీ అన్న చదవిస్తాడని చెబుతున్నా
► ప్రతి కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్ రావాలి. 
► మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నా ఇబ్బంది పడకుండా పిల్లలను బడులకు, కాలేజీలకు పంపండి. 
►విద్యా దీవెన, వసతి దీవెనలో ఎటువంటి కత్తిరింపులు లేవు.
►ప్రతి పిల్లాడికీ మీ అన్న, మీ తమ్ముడు చదివిస్తాడని చెబుతున్నా. 
► పిల్లలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులకు ప్రతి సామాజిక వర్గానికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నాం’ అని సీఎం జగన్‌ ప్రసంగించారు

చదవండి: విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలి: రోజా సెటైర్లు 

మరిన్ని వార్తలు