త్వరలో ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడు

5 Feb, 2015 18:38 IST|Sakshi
త్వరలో ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో డిస్కంలన్నీ కలిసి ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలను ఈఆర్ సీకి సమర్పించారు. డిస్కంలు ప్రతిపాదించిన ఛార్జీలు....50 లోపు యూనిట్లకు రూ.1.40, 51 నుంచి 100 లోపు యూనిట్లకు రూ. 2.60, 101 నుంచి 150 వరకు రూ.     5.17, 151 నుంచి 200 వరకు రూ. 5.97, 201 నుంచి 250 వరకు రూ. 6.76, 251 నుంచి 300 వరకు రూ.7.29, 301 నుంచి 400 వరకు రూ. 7.82, 401 నుంచి 500 వరకు రూ. 8.35 వరకు, 500 యూనిట్లకు పైబడి రూ. 8.88 లు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అంతేకాకుండా తమ ప్రతిపాదనలపై డిస్కంలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నాయి. దాని తరువాత ఛార్జీల పెంపుపై సిఫారసు చేయాలని నిర్ణయించాయి. ఈ పరిణామాలను గమనిస్తే మార్చి నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు