2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా

13 Apr, 2014 10:34 IST|Sakshi
2016లో మధ్యంతర ఎన్నికలు: ఎంపీ చింతా

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, 2016లో మధ్యంతర ఎన్నికలు తప్పవని  తిరుపతి ఎంపీ చింతా మోహన్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ తప్పదన్నారు. ముందున్న రెండు పార్టీలకు ఒక్కోదానికి 70, కాంగ్రెస్‌కు 25 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చింతా మోహన్ చెప్పారు. తెలంగాణలో 119 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని అధికారాన్ని చేపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు