రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం

13 Jul, 2019 12:04 IST|Sakshi
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న  జిల్లా కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌గుప్త  

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌ /తిరుపతి క్రైం: రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా జిల్లాకు వస్తున్నారు. ఈమేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన జరిగే ప్రాంతాల్లో బార్‌కేడింగ్, శానిటేషన్‌ పనులను జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షించాలన్నారు. పద్మావతి అమ్మవా రి ఆలయం, తిరుచానూరు, కపిలతీర్థం, తిరుమల శ్రీవారి దర్శనం కార్యక్రమాల్లో ప్రతిచోటా లైజన్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు. కాన్వాయ్‌కు సంబంధించి అన్ని వాహనాలను కేటాయించాలని చెప్పా రు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 

రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత 
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్పీలు, 22 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు, 300 మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, 400 మంది పీసీలు, స్పెషల్‌ పోలీసులు 200 మంది, మూడు కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి 470 మంది, మొత్తం 1,692 మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు