పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు
చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. అతలాకుతం
ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు బంద్
మిచౌంగ్ తుపాను ప్రభావంతో.. కుంభవృష్ణి
కాళంగి నది ఉధృతి
ఏపీ-తమిళనాడు మధ్య రాకపోకలు బంద్
సూళ్లూరు పేటలో నాలుగు అడుగుల మేర ఎత్తులో ప్రవహిస్తున్న నది
ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటున్న పోలీసులు
రేపు ఉదయం వరకు ఎవరూ అటువైపు రావొద్దని వెనక్కి పంపిచేస్తున్న పోలీసుల
తిరుపతిలో స్కూళ్లకు సెలవు
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి
ధాన్యం నష్టపోకుండా..
ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచన
మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించిన మార్కెటింగ్ శాఖ
ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు
విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ )
తుపాన్ ఎఫెక్ట్‌తో గన్నవరం నుంచి విమానాలు రద్దు
ముంచుకొస్తున్న ముప్పు
అల్లకల్లోలంగా సముద్రం
రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిక
దక్షిణ కొస్తాను ముంచెత్తనున్న మిచౌంగ్
నెల్లూరు 120 కి.మీ. దూరంలో!
రేపు ఉదయానికి బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం
జిల్లా కలెక్టర్, రాజాబాబు మాట్లాడుతూ.. ‘‘నాగాయలంక , ఏటిమొగ,నాచుగుంట,ఈలచెట్ల దిబ్బ దీవుల పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీవుల్లోని ప్రజలను అప్రమత్తం చేశాం. కొందరిని ఇప్పటికే పునరావాసకేంద్రాలకు తరలించాం. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలిస్తాం. పోలీస్, రెవిన్యూ , ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
జిల్లా ఎస్పీ, జాషువా మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ఐల్యాండ్స్ లో పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. కమ్యూనికేషన్ కోసం వైర్ లెస్ కనెక్షన్స్ అందుబాటులో ఉంచాం. కలెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం
రాబోయే రెండు రోజుల్లో..
చెన్నైకి 90కి.మీ, నెల్లూరుకు 140 కిమీ.. బాపట్లకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను
రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం
ఇవాళ, రేపు కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
ఇవాళ రాత్రి దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం
నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
తరుముకొస్తున్న మిచౌంగ్
అధికార యంత్రాగం అప్రమత్తం
తిరుపతిలో..
రేణిగుంట విమానాశ్రయ రన్ వే పైకి వరదనీరు
రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి దూసుకొచ్చిన వరదనీరు..
వరదనీరు చేరిక కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానా రాకపోకలకు అంతరాయం..
#ChennaiRains
Hi Chennai!
The same old chennai with not a single improvement. This is happening every year & still no one cares about it. All they need is big apartments & for that they cut down the trees, demolish the lakes. Hence, the suffering!!!#CycloneMichuang#CycloneAlertpic.twitter.com/L0yo94nwBD
#WATCH | Tamil Nadu: Amid severe water logging due to heavy rainfall in Chennai city, Thillai Ganga Nagar Subway in Alandur has been closed. pic.twitter.com/jnQYVuJ9a1
పలుచోట్ల రైల్వే స్టేషన్లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
#WATCH | Tamil Nadu: As cyclone 'Michaung' approaches Chennai coast, accompanied by heavy rainfall, several trains are delayed and a few have been cancelled.
#ChennaiRains to continue till noon #ChennaiRain#CycloneMichaung is 110 kms E-NE of #Chennai as it slowly moves North closer to the coasts of North Tamil Nadu & South Andhra Pradesh. North TN will see heavy rains till noon. Coastal AP will see heavy rains post late noon with… pic.twitter.com/N3IggzlHz6
మిచౌంగ్ తుపాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు
ఒంగోలు - 08592-280306
కాకినాడ టౌన్ - 0884-2374227
తెనాలి - 08644-227600
గూడూరు - 08624-250795; 7815909300
నెల్లూరు - 0861-2345863
ఏలూరు - 08812-232267
బాపట్ల - 08643-222178
భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402
సామర్లకోట - 0884-2327010
గుడివాడ - 08674-242454
విజయవాడ - 0866-2571244
తుని - 0885-4252172
రాజమండ్రి - 0883-2420541.
విశాఖ, అనకాపల్లిలో సెలవు..
►మిచౌంగ్ తుపాన్ కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అని ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలకు, జూనియర్ కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
►తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.