ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తే...ఆర్టీసీకి నష్టాలే వస్తాయి!

15 Sep, 2013 06:34 IST|Sakshi


 ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ప్రయివేటు వాహనాలకు రవాణ శాఖ మంత్రి ఇష్టానుసారంగా  అనుమతినిస్తుంటే ఆర్టీసీకి న ష్టాలు కాకుండా లాభాలు ఎలా వస్తాయని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మయ్య ప్రశ్నించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ కమిటీ సమావేశం శనివారం ఖమ్మంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రయివేటు వాహనాలకు రవాణ శాఖ మంత్రి అక్రమంగా పర్మిట్ ఇస్తున్నారని, ఆర్టీసీకి నష్టం వస్తున్నా పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు.
 
 ఆర్టీసీ గుర్తింపు సంఘాలైన టీఎంయూ, ఈయూ.. ప్రత్యేక తెలంగాణ-సమైక్యాంధ్ర సాధ్యమేనంటూ రెండుచోట్ల  ఆందోళనకు దిగి, కార్మికులను మోసగిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ విడిపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ సంఘాలు చెప్పాలని డిమాండ్ చేశాశారు. సమావేశంలో రీజియన్ కార్యదర్శి గడ్డం లింగమూర్తి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎంఎన్.రెడ్డి, కార్యదర్శి సుందరయ్య,  సహాయ కార్యదర్శి పిల్లి రమేష్,  కోశాధికారి గుండు మాధవరావు, నాయకులు తోకల బాబు, సుధాకర్, నర్సింహారావు, సిహెచ్‌వికె.రెడ్డి, జాకబ్, ప్రతాప్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

మరిన్ని వార్తలు