డెంగీ ఫీవర్

12 Aug, 2015 23:35 IST|Sakshi
డెంగీ ఫీవర్

కలవరపెడుతున్న డెంగీ...
జాగ్రత్తలు పాటించకుంటే డేంజర్

 
విశాఖ మెడికల్: నగరంలో డెంగీ వ్యాధి అవహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది మురికివాడ ప్రజలు జ్వరాలతో కదలేని పరిస్థితుల్లో మంచాన పడుతున్నారు. జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు గత నెలలో చేపట్టిన సమ్మెకారణంగా నగరంతోపాటు జిల్లాలోని పట్టణాల్లోనూ దోమలు వ్యాపించాయి. శిథిలమైన డ్రై న్లు, గెడ్డల్లో ఉన్న నిల్వ నీటిలో దోమలు స్వైర్యవిహారం చేయడం,మరోపక్క రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలు పడటం వంటి కారణాలతో దోమకాటు పెరిగింది. ఫలితంగా జ్వరాలతో బాధపడివారి సంఖ్య పెరుగుతున్నారు. జ్వరం వచ్చి, నీరపడిపోవడం, విపరీతమైన ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతోఎక్కువమంది బాధతపడుతున్నారు. ఈ తరహా లక్షణాలు కేవలం డెంగీ వ్యాధిగ్రసులలో ఎక్కువగా ఉండచ్చని వైద్యులు సూచిస్తున్నారు. విశాఖ నగరంతోపాటు గ్రామీణ జిల్లాలోనూ ఈ వ్యాధిలక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో  ఈ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి లక్షణాలపై  ప్రత్యేక కథనం...
 
డెంగీ ప్రాణాంతకమైన వ్యాధికాకపోయినా నిర్లక్ష ్యం చేస్తే ప్రాణాలకు ముప్పుతప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి డెంగీ జ్వరం అన్ని వైరల్ జ్వరాల్లాగా మామూలుదే. చాలా మందికి ఈ జ్వరం వచ్చి బయటపడుకుండానే దానికేదే తగ్గిపోతూ ఉన్న సందర్భాలూ ఉంటాయి. వైద్య పరిభాషలో దీన్ని ‘సబ్ క్లినిక్‌ల్ ఇన్‌ఫెక్షన్’అంటారు. డెంగీ వ్యాధి ‘గ్రూప్-బి ఆర్టోవైరస్’అనే వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి. ప్రస్తుతం అపరిశుభ్రత నెలకొన్న మురికివాడ ప్రాంతాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒకపక్క వర్షాలు, మరోపక్క పెంటకుప్పల్గా పేరుకుపోతున్న చెత్తచెదారాలతో దోమల బెడద నగరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దోమకాటుద్వారా వచ్చే డెంగీ నగరంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.  వ్యాధి ఉన్న రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం ద్వారా ఒకరి నుండి ఒకరికి..ఇంకొకరికి వ్యాధి వ్యాపిస్తోంది. నిల్వ నీళ్లలో వాలే ఎడిస్ ఈజిపై ్లఅనే దోమ కుడితే డెంగీ వ్యాధి ప్రబలుతోంది. దోమకుట్టిన 4 నుంచి  15రోజుల్లో వ్యాధి బయటపడుతుందని వైద్యులంటున్నారు.  కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్‌వాజులు, నీటికుండీలు, అండర్ గ్రౌండ్ ట్యాంకులు ఇలా ఎక్కడ నీళ్లు నిలవ ఉండటానికి అవకాశముంటే అక్కడంతా ఈ దోమగుడ్లు పెడుతుంది. పాతటైర్లు, పనికిరావని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాల్లో నీళ్లు నిల్వ ఉంటే ఆనీట్లో కూడా ఈ దోమలు గుడ్లు పెడతాయి. వారం పదిరోజుల్లో లక్షలాది పిల్లదోమలు పుడతాయి. దోమలు చల్లని, నీడ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకొని అవి మన ఇళ్లలో కర్టెన్ల వెనకా, తలుపుల వెనకా, గోడల మాటున విశ్రమిస్తాయి. ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో కుట్టడం ప్రారంభిస్తాయి.
 
 డెంగీ హేమరేజిక్ ఫీవర్

 రెండోదశ ఇది. ఇది  ప్రమాకరమైన జ్వరం. శరీరంలోని ఏ భాగంనుండైనా రక్తస్రావం జరగడం దీని లక్షణం. రక్తపోటును చూసిన విధంగానే బీపీ పనిముట్లు గుడ్డపట్టినీ చేతికి కట్టి, పీడనం పెంచితే కూడా ఎర్రటి మచ్చలు చర్మంపై ఏర్పడతాయి. నిజానికి డెంగీలో రక్తస్రావం జరుగుతుందా? లేదా తెలుసుకోవడానికి ఇదొక పరీక్షకూడా. సాగదీస్తే రక్తం కారడం, పళ్ల నుంచి రక్తం, రక్తవాంతులు, నల్లటి మలం, ముక్కు నుంచి రక్తం కారడం, ఇవన్నీ కూడా ఈ జ్వరంలో కన్పించవచ్చు. డెంగీ హెమరేజిక్ ఫీవర్ ముదిరితే  ‘రక్తప్రవసరణ వైఫల్యం’ ఉంటుంది. నాడీ బలహీనపడటం, లోబీపీ, కాళ్లు, చేతులు చల్లబడటం, తీవ్రమైన దాహం, స్థిమితంగా ఉండకపోవడం లాంటిలక్షణాలు బహిర్గతమవుతాయి.
 
 లక్షణాలు
విపరీతమైన ఒళ్లు నొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి ..మితిమీరిన నీరసం ఉంటుంది. రెండు,మూడు రోజుల్లో తగ్గి మళ్లీ జ్వరం కనిపించడం అనేది డెంగీ ప్రధాన లక్షణం.ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి తరహాలో బాధ ఉంటడటం వల్ల ఈ వ్యాధికి ఎముకలు విరిచే జ్వరం అని అంటుంటారు. ఇందులో మూడు దశలున్నాయిమొదటిది సాధారణ డెంగీ జ్వరం, రెండోది హెమరేజిక్ జ్వరం, మూడోది  షాక్ సిండ్రోం.చాలా మందిలో మొదటి దశ నుండే కోలుకుని సాధారణ స్థితికి వచ్చేస్తారు. కొద్ది మంది రెండోదశకు, మరికొద్దిమంది మూడో దశకు చేరుకుంటారు. రెండు, మూడుదశలు ప్రమాకరమైన దశలు.  మరణాలు ఎక్కువగా మూడోవ దశలో జరుగుతాయి.
 
ఎలా గుర్తించాలి?

మొదటి దశలో వాధిని గుర్తించటం కష్టమే. డెంగీ జ్వరాలు జూలై నుండి డిసెంబరు మాసాల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలుఉన్నాయి.
ఈ సమయంలో విపరీతంగా ఒళ్లునొప్పులుండే జ్వరాలన్నింటికీ డెంగీగా భావించి రక్తపరీక్ష చేయించడం మంచిది. బ్లడ్‌సెల్స్ తగ్గి ఉంటే డెంగీగా నిర్ధారిస్తారు.రక్త సెల్స్ తగ్గినంత మాత్రన డెంగీ అని భావించనక్కరలేదు. వైరల్, మలేరియా లాంటి ఇతర వ్యాధులు సోకినప్పుడు కూడా ఈ సంఖ్య తగ్గొచ్చు. ప్రతేకమైన  నిర్ధారిత పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది.రెండవ దశలో, మూడోదశలో లక్షణాలు స్ఫష్టంగా ఉంటాయి. అందువల్ల వ్యాధిని నిర్థారించడటం సులభం.
 
నివారణ మన చేతుల్లోనే..
డెంగీ వ్యాధికి ఇప్పటి వరకు టీకా మందు లేదు. దోమల నివారణ ఒక్కటే సాధ్యం. దోమలు అధిక సంఖ్యలో పుట్టకుండా, పుట్టిన దోమలు కుట్టకుండా చూసుకోవడమే నివారణ మార్గం.ఇంటిలోపల ఏ ప్రాంతంలోనైనా మంచినీరు ఐదు రోజులు మించి నిల్వ ఉంచకూడదు.ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో వారానికి ఒకసారి నీటిని మార్చుకోవాలి.పగటిపూట పొడవాటి చేతుల చొక్కాలు, లాగులు తొడుక్కోవాలి.దోమలు కుట్టకుండా లేపనాలుపూసుకోవాలిఇంటి కిటికీలకు దోమతెరలు కట్టించుకోవాలిడెంగీ జ్వరాలున్న ప్రాంతాలలో వారానికి ఒక్కరోజు డ్రైడే పాటించాలి.
 
దండిగా బాధితులు
వైద్య ఆరోగ్యశాఖ వీటి తీవ్రతను తక్కువచేసి చూపుతున్నాయి. కొన్ని కేసులను మాత్రమే అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ, అధిక సంఖ్యలో కేసులు అనధికారికంగానే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.  ఇటీవల జీవీఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా క్షీణించిన పారిశుధ్య పరిస్థితులు, ఎండల తీవ్రత వల్ల ఎడిస్ దోమల ఉత్పత్తి పెరిగి డెంగీ జ్వరం నగరంపై దాడిని పెంచింది. నగర పరిధిలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రి కేజీహెచ్‌లో కూడా డెంగీ జ్వరబాధితులు ఎక్కువ సంఖ్యలో చికిత్సలు పొందుతున్నారు. కేజీహెచ్‌లోని మెడిసిన్, పిల్లల వార్డుల్లో డెంగీ జ్వరబాధితుల సంఖ్య రోజురోజుకూ పెరగడమే ఈ విషయాన్ని రుజువుచేస్తోంది. కేజీహెచ్ పిల్లల వార్డులో 7 కేసులకు పైగా నమోదుకాగా, మెడికల్  వార్డుల్లో కూడా జ్వరబాధితుల తాకిడి ఎక్కువగా ఉంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి గత పది రోజులుగా డెంగీ జ్వరబాధితులు మెరుగైన వైద్యంకోసం నగరానికి తరలివస్తున్నారు. ఎక్కువ మంది  ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు.
 
ప్లేట్‌లెట్ల వ్యాపారం జోరు..

 ప్లేట్‌లెట్ల వ్యాపారం ఊపందుకుంది. పలు బ్లడ్‌బ్యాంక్‌లు ప్లేట్‌లెట్‌ల జారీని ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించి రోగులను అధికంగా వసూలుచేన్నాయి. పరోక్షంగా కొంతమంది వైద్యులు కొమ్ముకాయడం విమర్శలకు తావిస్తోంది. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల విషయానికిఒస్తే ఒక్కో ఆస్పత్రిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు ఈ జ్వరాలతో బాధపడుతున్నారు.
 
 యాంటీ లార్వా ఆపరేషన్స్

 డెంగీ కేసులు నగరంలో నమోదవుతున్నాయి. మురికివాడ ప్రాంతాల నుంచి ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను నగరంలో విస్తృతంగా చేపట్టాం. ఇళ్లలో నిల్వ చేసుకుంటున్న నీటి నుంచే దోమలు వృద్ధి చెందే అవకాశాలున్నాయని గుర్తించి వాటిపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. డెంగీ కేసులు నమోదయ్యే మురికావడలతో పాటు అనుమానిత ప్రాంతాల్లో పైరిత్రం మందును స్ప్రే చేస్తున్నాం. ఫాగింగ్ ఆపరేషన్ మొదలెట్టాం.
 - డాక్టర్ మురళీమోహన్
 ముఖ్య ప్రజారోగ్య శాఖాధికారి, జీవీఎంసీ
 
 

మరిన్ని వార్తలు