పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు: జైరాం రమేశ్

1 May, 2014 20:47 IST|Sakshi
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ ను నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తి చేస్తామని కేంద్ర కేబినెట్ తెలిపింది.
 
పోలవరం ప్రాజెక్ట్ కు 90 శాతం కేంద్ర నిధులు, ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు, పోలవరం నిర్మాణ వ్యవహారాన్ని పోలవరం అథారిటీ చూస్తుందని కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు.
 
కీలక ఎన్నికల జరుగుతున్న సమయంలో పోలవరం నిర్మాణంపై హడావిడిగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా లబ్ది పొందడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. 
మరిన్ని వార్తలు