వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో యువకుడి మృతి

20 Nov, 2023 10:52 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ మ్యాచ్‌ చూస్తూండగా ఉత్కంఠ లోనైన క్రికెట్అభిమాని గుండె పోటుతో మృతి చెందాడు. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామానికి చెందిన జ్యోతి కుమార్‌ యాదవ్‌ అనే యువకుడు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న జ్యోతి కుమార్‌.. ఇంటి వద్దనే ఆదివారం భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ఫైన్‌ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి చూశాడు. ఎంతో ఉద్వేగంతో మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో గుండె నొప్పి రావడంతో చికిత్స కోసం స్నేహితులు తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

మ్యాచ్ చూస్తున్న సమయంలో  ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు పడే సరికి ఆనందంతో తట్టుకోలేక ఊగిపోయాడని,  ఆ తర్వాత గుండె నొప్పి రావడంతో తుది శ్వాస విడిచాడని స్నేహితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుడు కుటుంబాన్ని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరామర్శించారు.


చదవండి: దేశం ఎప్పుడూ మీ వెంటే: వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిపై ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు