పీఎస్‌యూ ఉద్యోగులకూ ఐఆర్!

18 Jan, 2014 04:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) త్వరలోనే అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని పేర్కొనడం తెలిసిందే. ఫలితంగా దాదాపు 80 వేల మంది పీఎస్‌యూ ఉద్యోగులకు ఐఆర్ అందే అవకాశం లేకుండా పోయింది.
 
 ఈ అంశంపై ‘సాక్షి’ ఇటీవల వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సంబంధిత  జీవో సవరణకు చర్యలు చేపట్టింది. ఈమేరకు రూపొందించిన ఫైలుపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం సంతకం చేసి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం ఆమోదించాక జీవో వెలువడే అవకాశం ఉందన్నాయి.

మరిన్ని వార్తలు