రూ 108 కే ఆక్సిజన్ సిలిండర్

14 Nov, 2013 03:46 IST|Sakshi

ఎంజీఎం, న్యూస్‌లైన్:   ఎంజీఎంలో ఆక్సిజన్ దందాకు తెరపడింది. గత ఆరేళ్ళుగా నిరాటంకంగా నడుస్తున్న దోపిడీ వ్యవస్థకు చెక్ పడింది. 2007 నుంచి తులసీ ఏజెన్సీ ద్వారా ఆస్పత్రికి రూ 385లకు సరఫరా చేస్తున్న సిలిండర్ ధర టెండర్లలో ప్రస్తుత కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంజీఎం సూపరింటెండ్, పరిపాలన అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించడంతో ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ ధర రూ108కి పడిపోయింది. దీంతో ఆస్పత్రికి రోజు సుమారు 100 సిలిం డర్లు అవసరమవుతుండగా ఒక్కొ సిలిండర్‌పై 277 చొప్పున రోజుకు సుమారు రూ 30 వేల మిగులు చొప్పులన నెలకు రూ 9 లక్షలు సంవత్సరానికి రూ కోటి ఆదా అవుతాయని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్ పేర్కొన్నారు.
 దోపిడీకి స్వస్తి
  ఆరేళ్ళుగా ఎంజీఎంలో కొనసాగుతున్న ఆక్సిజన్ అక్రమ దందాకు బుధవారంతో తెరపడింది. 2006 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు గత పరిపాలన అధికారులు వత్తాసు పలికి యథేచ్చగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 2006 నుంచి 2011 వరకు టెండర్ల పేరుతో ఈ ప్రక్రియ సాగగా.. తదనంతరం టెండర్ల ప్రక్రియకు కూడా స్వస్తి పలికారు.
 లిక్విడ్ ఆక్సిజన్ పేరుతో టెండర్లకు స్వస్తి
 ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు, మరణాలను తగ్గించేం దుకు 2011లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇదే అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ అప్పటి సూపరిండెంట్‌ను మచ్చిక చేసుకుని ప్లాంట్ పూర్త య్యే వరకు టెండర్ల పిలవద్దని  ఆదేశాలు జారీ చేయించారు. దీంతో 2011-12, 2012-13 సంవత్సరాలకు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిన రూ 385లకే ఎంజీఎం ఆస్పత్రికి సిలిండర్లను సరఫరా చేశారు.
 నివ్వెరపోయిన అధికారులు..
 ఎంజీఎంలో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ 108 కిపడిపోవడంతో అధికారులు నివ్వెర పోయారు. సిలిండర్ ఒక్కసారిగా రూ 385 నుంచి రూ 108కి అంగీకారం కుదిరిందనే విషయం చెబుతున్న తరుణంలో వాస్తవమేనా.. అని చర్చించుకోవడం ఎంజీఎంలో కనిపించింది. మొత్తానికి గత అధికారులు చేసిన తప్పిదానికి ప్రస్తుత అధికారులు   నిక్కచిగా వ్యవహరించి ప్రభు త్వ ఖజానా గండికొట్టకుండా వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి వైద్యులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు