25న ఆర్టీసీ విలీన ప్రక్రియ కమిటీ భేటీ 

20 Jun, 2019 05:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా అధ్యయన కమిటీ తొలి సమావేశం ఈ నెల 25న జరగనుంది. అంతకుముందే కమిటీ చైర్మన్, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి, సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఆర్టీసీని విలీనం చేసే విషయమై అధ్యయనం చేసేందుకుగాను ఈ నెల 14న ఏపీ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కమిటీ ముందుగా విలీన ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు, డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టడం, ఆర్టీసీ కార్మికుల ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారం, ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న అప్పులపై సమగ్ర అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. మాజీ సీఎం చంద్రబాబు ఆర్టీసీకున్న స్థలాల్ని పప్పు బెల్లాల్లా టీడీపీ నేతలకు దీర్ఘకాలిక లీజులకు ఇచ్చేశారు. వీటన్నింటిపై కూడా కమిటీ అధ్యయనం చేయనుంది.

>
మరిన్ని వార్తలు