విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్‌ విశేష కృషి

13 Dec, 2023 06:12 IST|Sakshi

నంద్యాలలో విద్యార్థుల భారీ ర్యాలీ

సాక్షి, నంద్యాల: విద్యారంగంలో సీఎం జగన్‌ తీసుకు­వచ్చిన సంస్కరణలు, పథకాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్‌ యాదవ్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు.

‘వై ఏపీ నీడ్స్‌ వైఎస్‌ జగన్‌’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నంద్యాలలో ‘విద్యా సాధికారిత జగనన్నతోనే సాధ్యం’ అని తెలిపేలా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతినగర్‌లోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి శ్రీనివాస్‌ సెంటర్‌లోని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.

చైతన్య, సురేష్‌ మాట్లాడుతూ ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని తెలి­పారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్స్‌ సంఖ్య తగ్గిందన్నారు. ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ విద్యా బోధన, టోఫెల్‌ శిక్షణ తదితర కార్యక్రమా­లతో అంతర్జాతీయ స్థాయి విద్యను పేద విద్యార్థు­లకు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయ­లసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ చైర్మన్‌ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు