స్థానిక నివాసాలపైనే దృష్టి

17 Jun, 2018 09:18 IST|Sakshi

అందుబాటులో ఉంటేనే అందరికీ ఆరోగ్యం

అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

శాఖాపరమైన సమస్యలుంటే తక్షణ పరిష్కారం 

సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయలక్ష్మి

విజయనగరం ఫోర్ట్‌:  అంతా ఆరోగ్యం గా ఉండాలంటే అందుబాటులో సి బ్బంది ఉండాలి. పనిచేసే చోట నివా సం ఉండకుండా ఎక్కడో ఉంటూ రాకపోకలు చేయడంవల్ల ఒక్కోసారి అర్ధరాత్రి సేవలు అందించలేకపోవచ్చు. అందుకే ఉద్యోగం ఎక్కడో అక్కడే నివాసం ఉండాలన్నది నా ఉద్దేశం. సిబ్బంది కచ్చితంగా దీనిని పాటించాలి. దీనిపైనే దృష్టి పెడుతున్నాను. ఇంకా శాఖాపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కొత్తగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి చెప్పారు. సాక్షితో శనివారం ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

ఇంటర్వ్యూల సమయంలో స్థానికంగా ఉంటామని చెబితేనే ఉద్యోగాలకు ఎంపిక చేస్తాం. కానీ ఏఎన్‌ఎం, రెండో ఏఎన్‌ఎం, ఇతర ఉద్యోగులు చాలా మంది స్థానికంగా నివాసం ఉండట్లేదని నా దృష్టికి వచ్చింది. అలాంటివారిపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడానికైనా వెనుకాడేది లేదు. కచ్చితంగా వారు స్థానికంగా నివాసం ఉండాల్సిందే.

♦ జిల్లాలో ఏదైనా ప్రాంతంలో డెంగీవ్యాధి ఉన్నట్టు తెలిస్తే తక్షణం దానికి గల కారణాలను ఆరా తీస్తాం. అసలు ఇలాంటివాటిని ముందస్తుగానే నియంత్రించేందుకు చర్యలు చేపడతాం. ప్రజలకు ఆరోగ్యంపైనా... పారి శుద్ధ్యంపైనా అవగాహన కల్పి స్తాం. పంచాయతీరాజ్, మున్సి పాలిటీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల సహకారంతో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం. 

♦ గిరిజన ప్రాంత ప్రజలు కొంతమంది అవగాహన లేక ప్రభుత్వం అందించిన దోమతెరలను వినియోగించడం లేదు. అటువంటి వారితో నేరుగా మాట్లాడి, వారిని చైతన్యపరచి దోమ తెరలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం.

♦ వాతావరణ మార్పులవల్ల అక్కడక్కడా జ్వరా లు ప్రబలుతున్నాయి. ఎక్కడైనా అలాంటి సమ స్య ఉన్నట్టు తెలిస్తే వెంటనే అదుపునకు చర్యలు తీసుకుంటాం. వైద్యశిబిరాలు వెనువెంటనే ఏర్పా టు చేసి చికిత్సలు అందిస్తాం. రక్తనమూనాలు సేకరించి మలేరియా వంటివి సోకినట్టయితే పర్యవేక్షణ పెంచి మందులు అందిస్తాం. గ్రామంలో క్లోరినేషన్, స్ప్రేయింగ్‌ వంటివి చేపడతాం.

♦ జిల్లాలో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు పూర్తిస్థాయిలో అందకపోవడానికి వాహనాలు చాలక పోవడమే కారణం. దీనివల్ల సేవలు పూర్తి స్థాయిలో అందకపోవచ్చు. వాటి సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకుంటాం.  

♦ ఇంకా ఇళ్లల్లోనే గిరిజన ప్రాంతాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. మూఢ నమ్మకాల కారణంగానే వారు ఆస్పత్రులకు చివరివరకూ తరలించేందుకు సుముఖత చూపడంలేదు. వారిని సిబ్బంది ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేరేలా చైతన్యపరిచేలా చూస్తాం. ఇటీవల ఫీడర్‌ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. దీనివల్ల కొంతవరకూ రవాణాకు ఇబ్బంది ఉండకపోవచ్చు. 

>
మరిన్ని వార్తలు