రైల్వే ఆదాయానికి సమైక్య సెగ

5 Oct, 2013 06:31 IST|Sakshi

 ఆమదాలవలస, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ కు అనుకూలంగా కేంద్ర మంత్రిమండలి ఆమో దం తెలపడంతో సీమాంధ్ర జిల్లాల్లో పెల్లుబికిన ఆగ్రహజ్వాల రైల్వే శాఖకు తాకింది. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ జేఏసీ ఆమదాల వలస పట్టణ బంద్‌కు పిలుపు నిచ్చింది. వాహనాల రాకపోకలు ఎక్కడక్కడ నిలిచి పోవడంతో ఆమదావలస రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు రాలేకపోయారు. దీంతో ప్రయాణికులతో రద్దీగా ఉండే శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ శుక్రవారం  వెలవెలబోయింది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రయాణికులు ఇక్కడికి  వస్తారు. బంద్ ప్రకటించడంతో పలువురు ప్రయాణికులు తమప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దీంతో రైల్వేస్టేషన్‌కు గణ నీయంగా ఆదాయం తగ్గింది.  సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు  రూ. 6లక్షలు ఆదాయం సమకూరుతుంది.
 
 బంద్‌తో *2.50 లక్షలే ఆదాయం సమకూరిందని రైల్వే అదికారులు తెలిపారు.  వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ప్రత్యూమ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో రైల్వే స్టేషన్ ఆవరణలో పడిగాపులు  పడ్డారు.  ప్రయాణికులు లేకపోవడంతో బుకింగ్ కార్యాలయం బోసిపోయింది. ప్రయాణికులు లేక కొన్ని రైళ్లు  ఖాళీగా వెళ్లాయి. మొత్తంమీద సమైక్య బంద్ ప్రభావం రైల్వే శాఖమీద తీవ్రంగాచూపిందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు