శాస్త్రీయ దృక్పథంతోనే మానసిక చైతన్యం

11 Oct, 2014 02:42 IST|Sakshi
శాస్త్రీయ దృక్పథంతోనే మానసిక చైతన్యం

అనంతపురం టవర్‌క్లాక్ :
 శాస్త్రీయ దృక్పథంతోనే ప్రజలు మానసికంగా చైతన్య వంతులు కాగలరని ఎమ్మెల్సీ డాక్టర్‌గేయానంద్ ఆన్నారు. శుక్రవారం నగర శివారులో శ్రీశ్రీ నగర్‌లో ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని మేయర్ స్వరూప ప్రారంభించారు. కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సత్యప్రకాష్ హాజరయ్యారు. అనంతరం గేయానంద్ మాట్లాడుతూ ప్రజల్లో మానసిక రుగ్మతలపై చైతన్యం పెరగాల్సి ఉందన్నారు.

చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశానికి లోనై జీవితాలనే బలిచేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ  మానసిక వికాసంతో శాస్త్ర్రీయ దృక్పథం అలవరుచుకోవాలని తెలిపారు. మేయర్ స్వరూప మాట్లాడుతూ ప్రజల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానసిక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు. మానసిక జబ్బులకు నేడు అధునిక వైద్యం అందుబాటులో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ దేశంలో నేటికి మానసిక రుగ్మతలతో ఎంతో మంది తనువు చాలిస్తున్నారని తెలిపారు. వైద్యం శిబిరం నిర్వహించిన సీపీఎం శాఖ, ట్రినిటీ రిహబిలిటేషన్స్ ట్రస్టు వారిని ఆయన అభినందించారు. మానసిక, స్త్రీ వ్యాదులు, పిల్లల జబ్బులు గురించి అవగాహన కల్పించారు. ప్రజల్లో మానసిక జబ్బులపై అవగాహన కల్పించుటకు ప్రభుత్వం ముందుకు రావాలని మానసిక వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో కార్పొరేటర్ భూలక్ష్మి, సాహితి సంస్థ కన్వీనర్ వేణుగోపాల్, సీపీఎం నాయకులు  ప్రకాష్‌రెడ్డి, గిరి, కుమార్, విజయ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు