మీకు తెలుసా? మైండ్‌లోనూ డిక్షనరీ ఉంటుదట! పరిశోధనలో విస్తుపోయే విషయాలు!

17 Nov, 2023 10:15 IST|Sakshi

డిక్షనరీ అనేది బుక్‌షెల్ఫ్‌లోనే కాదు మనలోనూ ఉంటుంది. దీన్ని మెంటల్‌ డిక్షనరీ అంటారు. ఫిజికల్‌ డిక్షనరీలాగే ఈ మెంటల్‌ డిక్షనరీలోనూ రకరకాల పదాలు, వాటికి సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మెంటల్‌ డిక్షనరీ విషయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య  స్వల్ప తేడాలు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల కొందరి మెంటల్‌ డిక్షనరీలో పరిమితమైన పదసంపద మాత్రమే ఉండొచ్చు.

కొందరి విషయంలో మాత్రం విద్య, కళలు, జీవితానుభవాలు...మొదలైన వాటి వల్ల పదసంపద ఎక్కువగా ఉంటుంది. 20 సంవత్సరాల అమెరికన్‌ ఇంగ్లీష్‌ స్పీకర్‌కు 40,000 పదాల వరకు తెలిసి ఉంటాయని, 60 ఏళ్ల వయసులో ఆ పదాల సంఖ్య 48,000లకు చేరుతుందని, కొందరి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని సందర్భాలలో మనం ఉపయోగించాల్సిన పదం గురించి తెలిసినా గుర్తు రాకపోవచ్చు. ఈ పరిస్థితిని టిప్‌–ఆఫ్‌–ది–టంగ్‌ ఫినామినన్‌ అంటారు, వయసు పెరుగుతున్న కొద్దీ ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది. 

(చదవండి: చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే.. మైమరచిపోవాల్సిందే)

మరిన్ని వార్తలు