అనంతపురం జిల్లాలో సమ్మె మరింత ఉధృతం

15 Aug, 2013 14:40 IST|Sakshi

అనంతపురం: జిల్లాలో సమైక్య ఉద్యమాలు మరింత ఉధృతమైయ్యాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలో గురువారం వేలాదిమంది ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఇదిలా ఉండగా ఏపీఎన్జీవో, మున్సిపల్, రెవిన్యూ ఉద్యోగుల చేపట్టిన నిరాహారదీక్షలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి.  జాక్టో, ఎస్టీ, బీసీ సంఘాలు వినూత్న ప్రదర్శన చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ ఉద్యోగుల దీక్షకు వైఎస్సార్‌సీపీ నేత వివేకానంద రెడ్డి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

 

శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థుల చేపట్టిన రిలే దీక్షలు 16వ రోజు కూడా కొనసాగుతున్నాయి.  పలు ప్రాంతాల్లో విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. . సమ్మెను మరింత ఉధృతం చేస్తామని,  ఎట్టి పరిస్థితిల్లోనూ సమ్మె ఆపేది లేదని ఎస్కేయూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వాన్ని హెచ్చరించారు
 

మరిన్ని వార్తలు