సూర్యగ్రహణం: నిలబడిన రోకళ్లు.. ప్రత్యేక పూజలు

26 Dec, 2019 12:00 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లాలో వింత ఆచారం 

సాక్షి, శ్రీకాకుళం: సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఏ ఆధారం లేకుండా నిలబెట్టిన రోకళ్లకు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యగ్రహణం రోజున రోకళ్లు వాటంతట అవే నిలబడతాయని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. గిన్నెలో నీళ్లు పోసి రోకలిని ఏ ఆధారంలేకుండా నిలబెడతారు. సూర్యగ్రహణం ప్రభావంతో ఏ సపోర్ట్‌ లేకపోయినా రోకళ్లు నిటారుగా నిలబడతాయని శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజలు విశ్వసిస్తారు. ఇలా నిలబెట్టిన రోకళ్లకు పూజలు చేస్తున్నారు. గురువారం సూర్యగ్రహణం సంభవించడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం కె.కొత్తవలస గ్రామంలో స్థానికులు రోకలిని నిలబెట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళంలోని పలు మండలాల్లో, గ్రామాల్లో ఈ ఆచారాన్ని స్థానికులు పాటించడం కనిపిస్తోంది. గ్రహణం ఎఫెక్ట్‌ కారణంగానే సూర్యభగవానుడి శక్తితో రోకళ్లు ఇలా నిలబడతాయని స్థానికులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు