సుబ్రహ్మణ్యస్వామి హుండీలో ఐఫోన్‌ 6..

11 Mar, 2018 20:00 IST|Sakshi

సాక్షి, కృష్ణా : సాధారణంగా ఆలయాల హుండీల్లో భక్తులు డబ్బులు, బంగారు ఇతర విలువైన కానుకలు వేస్తారు. కానీ, కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రసిద్ధ శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయ హుండీలో ఎవరో భక్తుడు ఖరీదైన యాపిల్‌ ఐ ఫోన్ ‌6ను కానుకగా వేశారు. శనివారం ఆలయ అధికారులు హుండీని తెరిచి అందులో ఐఫోన్‌ చూసి ఆశ్చర్యపోయారు.. గతంలో భక్తుల ఫోన్‌లు అనుకోకుండా హుండీలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయని ఆలయ సూపరింటెండెంట్‌ అధికారి తెలిపారు.

అయితే, ఈ ఫోన్‌ కొత్తదని సీలు కూడా తీయలేదని గ్యారంటీ కార్డ్‌ కూడా అందులో ఉందని చెప్పారు. కొత్త మెబైల్‌ దుకాణాన్ని ప్రారంభించిన భక్తుడు ఎవరో దేవుడికి ఈ కానుక వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఖరీదైన ఫోన్‌ను ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి తాము లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫోన్‌ను వేలం వేసి వచ్చిన ఆ డబ్బును ఆలయ ఖాతాలో జమ చేయాలా? లేదా ఫోన్‌ను భక్తులకు సమాచారం అందించేందుకు రిసెప్షన్‌లో ఉంచాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు