పీఎల్‌ఎఫ్ తక్కువగా ఉంటే పెనాల్టీ వేయొచ్చు

14 Aug, 2014 03:28 IST|Sakshi

స్పెక్ట్రమ్ పిటిషన్‌ను కొట్టేసిన ఈఆర్‌సీ

 హైదరాబాద్: ఒప్పందం కంటే ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) తక్కువగా వచ్చినందున ప్రోత్సాహ రహితం (డిస్-ఇన్‌సెంటివ్-పెనాల్టీ) వసూలు చేసే అధికారం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తేల్చిచెప్పింది. 5, నవంబర్ 2002 నుంచి 16 డిసెంబర్  2013 మధ్యకాలంలో 68.49 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 68.5 శాతం కంటే తక్కువగా వచ్చినందున రూ.25.61 కోట్ల పెనాల్టీని డిస్కంలు వసూలు చేశాయి.

దీంతో ఇలా వసూలు చేసేందుకు వీలులేదని పేర్కొంటూ స్పెక్ట్రమ్.. ఏపీఈఆర్‌సీని ఆశ్రయించింది. అయితే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) మేరకు నిర్దేశించుకున్న 68.49 శాతం పీఎల్‌ఎఫ్ కంటే తక్కువగా వస్తే పెనాల్టీ వేసే అవకాశం ఉందని ఈఆర్‌సీ స్పష్టంచేస్తూ.. స్పెక్ట్రమ్ పిటిషన్‌ను కొట్టివేసింది.
 
 

మరిన్ని వార్తలు