మేం డిగ్రీ స్పాట్ చేయం..

13 May, 2016 00:24 IST|Sakshi

 శ్రీకాకుళం న్యూకాలనీ: తమ సమస్యలను పరిష్కరించకపోతే డిగ్రీ మూల్యాంకనం (స్పాట్ వాల్యూషన్) చేయబోమని డిగ్రీ కళాశాలల లెక్చరర్లు తేల్చిచెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివ ర్సిటీ పరిధిలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం స్పాట్ వాల్యూషన్ గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
 
 అయితే ఉదయం నిర్ణీత సమయానికి స్పాట్ కేంద్రాలకు చేరుకున్న అధ్యాపకులు గతంలో తాము చేసిన డిమాండ్ల సంగతి ఏమైం దని సంబంధిత క్యాంప్ ఆఫీసర్లను నిలదీశారు. యూనివర్సిటీ నుంచి ఎలాంటి లిఖిత పూర్వకమైన ఆదేశాలు లేకపోవడం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో వారంతా మూల్యాంకనా న్ని బహిష్కరించారు. తమ డిమాండ్లను పరిష్కరించి, న్యాయం చేయాలని కోరుతూ వారంతా ప్రిన్సిపాల్ డాక్టర్ బాబూరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో నిరసన తెలియజేశారు.
 
 40 పేపర్ద దిద్దుబాటుపై మండిపాటు..
 పదో తరగతిలోగాని, ఇంటర్మీడియెట్‌లోగాని రోజుకు 30 పేపర్లు దాటి దిద్దుబాటు లేదని, అలాంటిది డిగ్రీ పేపర్లు మాత్రం 40 వరకు మూల్యాంకనం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. ప్రతి ఏడాది ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతున్న వర్సిటీ అధికారులు తమ రెమ్యూనిరేషన్, డీఏలను పెంచడంలో మాత్రం వివక్ష చూపుతున్నారని అన్నారు.  ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు డీఏ పెంచుతామని, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు పెంచమని సూచనప్రాయంగా తెలియజేయడంతో వారంతా భగ్గుమన్నారు.

>
మరిన్ని వార్తలు