జూన్ 15 నుంచి ఆమరణ నిరాహారదీక్ష | Sakshi
Sakshi News home page

జూన్ 15 నుంచి ఆమరణ నిరాహారదీక్ష

Published Fri, May 13 2016 12:22 AM

ndefinite hunger strike from June 15

ఖాళీగా ఉన్న ప్రభుత్వ
    ఉద్యోగాలను భర్తీ చేయాలి
 
 శ్రీకాకుళం అర్బన్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని జాతీయ నిరుద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు వస్తేనే జాబు వస్తుందని గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందని, బాబు వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.
 
  ఇలా చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని కోరారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా 88 పోస్టులను భర్తీ చేయడం దారుణమన్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జూన్ 15వ తేదీ నుంచి గుంటూరు వేదికగా ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ నిరుద్యోగుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి వర్రి హరీష్, లోకేష్, ప్రతినిధులు పి.భాస్కరరావు, జి.శ్రీనివాసరావు, పి.రాజారావు, పి.పృద్వీ, టి.రమణబాబు, ఆర్.శ్యాంసుందరరావు, కె.చిన్నారావు, గొర్లె సతీష్, మర్రి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement