బస్సు సర్వీసు రద్దుపై విద్యార్థుల ఆందోళన

5 Aug, 2015 19:27 IST|Sakshi

గుత్తి(అనంతపురం): ఆదాయం లేదనే కారణంతో బస్సు సర్వీసును అకస్మాత్తుగా రద్దు చేయటంతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలివి.. పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామానికి గుత్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి ప్రతి రోజూ కళాశాలల వేళకు బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సు ద్వారా నిత్యం 200 మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే, డిపోలో చాలినన్ని బస్సులు లేకపోవటంతో పాటు పాసులున్న విద్యార్థులు మాత్రమే ఆ బస్సులో ప్రయాణిస్తుండటంతో డిపోకు అదనంగా ఆదాయం ఏమీ రావటం లేదు.

ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం నాలుగు గంటల సర్వీసును రద్దు చేశారు. దీంతో దాదాపు వందమంది విద్యార్థులు సాయంత్రం 4గంటల సమయంలో డిపో ఎదుట నిరసన తెలిపారు. అధికారులెవరూ అందుబాటులో లేకపోవటంతో కొద్దిసేపటి తర్వాత ఆందోళన విరమించారు. వారంతా ఇంకా డిపో వద్దనే బస్సు కోసం పడిగాపులు కాస్తున్నారు.

మరిన్ని వార్తలు