పోలీస్‌ శాఖలో ఖాళీల భర్తీకి ప్రత్యేక డ్రైవ్‌

22 Jul, 2019 15:27 IST|Sakshi

 హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడి

సాక్షి, అమరావతి: పోలీస్ శాఖలోని వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో 333 మంది ఎంపికయినట్లు రాష్ట్ర  హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ పోస్టుల భర్తీకై మొత్తం లక్షా 35 వేల 414 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సీఎం, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతామని అన్నారు. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఇంకా 17శాతం వివిధ కేటగిరీల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ‘ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో 32 వేల 745 మంది అర్హత సాధించారు. తదుపరి నిర్వహించిన ఫైనల్ రాత పరీక్షలో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వారిలో సబ్ ఇన్ స్పెక్టర్ సివిల్ కు 149 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(రిజర్వు) 75 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపీ స్పెషల్ పోలీస్) 75 మంది డిప్యూటీ జైలర్లు(పురుష) 10 మంది, డిప్యూటీ జైలర్(మహిళ) 4, స్టేషన్ ఫైర్ అధికారులు 20 మంది మొత్తం 333 మంది ఎంపికయ్యారు.  రాత పరీక్షల్లో పరుచూరి మహేశ్ (నెల్లూరు), షేక్ హుస్సేన్ పీరా (కడప), పాలెం రవి కిశోర్(కడప) టాపర్లుగా నిలిచి ముగ్గురూ 255 మార్కులు సాధించారు. మహిళలు 15 వేల 775 మంది పరీక్షలకు దరఖాస్తు చేయగా వారిలో 61 మంది ఎంపికయ్యరూ. కృష్ణా జిల్లాకు చెందిన విశ్వనాధపల్లి ప్రజ్ఞ 224 మార్కులతో మహిళల్లో టాపర్ గా నిలిచారు. ఎంపికైన అభ్యర్ధులను వారి సర్టిఫికేట్లు పరిశీలన అనంతరం త్వరలో శిక్షణకు పంపండం జరుగుతుంది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతాం. వాటి భర్తీకి త్వరలో ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను చేపడతాం. అని హోం మంత్రి సుచరిత వివరించారు. 

ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల 

మరిన్ని వార్తలు