కడపలో తెలుగుదేశం కార్పొరేటర్ల రాజీ'డ్రామా'

3 Feb, 2018 18:30 IST|Sakshi

సాక్షి, కడప : నగర కార్పోరేషన్‌లో తెలుగుదేశం కార్పొరేటర్లు హైడ్రామాకు తెరతీశారు. విచారణలో తమ అవినీతి బండారం బయటపడుతుందని భావించిన నేతలు రాజీనామా డ్రామాను తెరమీదకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే..

పేదలకు నీడను అందిచాల్సిన పథకాన్ని తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నిలువ నీడలేని పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ గృహాలపై పచ్చతమ్ముళ్లు పాగావేశారు. పేదలకు మంజూరైన ప్రభుత్వ గృహాలను తమకు అనుకూలంగా ఉన్నవారికి, పార్టీనేతలకు మాత్రమే మంజూరు అయ్యే విధంగా తెలుగుదేశం కార్పోరేటర్లు అవకతవకలకు పాల్పడ్డారు. ఈ అవినీతి దందా గురించి ఉన్నతాధికారులకు సమచారం అందింది.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా గృహాల మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు. ఇందులో తెలుగుదేశం నేతల అవినీతి లీలలు చూసి అధికారులు సైతం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఈ అవినీతిలో కీలక పాత్ర పోషించిన కడప తహశీల్దార్‌పై రెండు రోజుల క్రితమే బదిలీ వేటు వేశారు. అయితే తమ ఆస్తులు పోగేసుకోవడానికి సహకరించిన సదరు అధికారిపై తెలుగుదేశం నేతలు విపరీతమైన అభిమానం చూపించారు.

తహశీల్దార్‌ బదిలీని అడ్డుకోవడానికి తెలుగుదేశం కార్పొరేటర్లు చేయాల్సిన ప్రయాత్నాలు అన్నీ చేశారు. అయినా కుదరకపోవడంతో రాజీ'డ్రామ'కు తెరలేపారు. తమపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. ఇంఛార్జ్‌ కమీషనర్‌, జయింట్‌ కలెక్టర్‌ తమపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారంటూ నానాహంగామా సృష్టించారు. తహసీల్దార్‌ బదిలీని ఆపకపోతే రాజీనామకు పాల్పతామంటూ బెదిరింపు రాజకీయాలకు దిగారు.

>
మరిన్ని వార్తలు