2023 సుభిక్షం.. సంతోషం | Sakshi
Sakshi News home page

2023 సుభిక్షం.. సంతోషం

Published Sun, Dec 31 2023 6:51 AM

andhra pradesh: YS Jagan Mohan Reddy AP Scheme 2023 - Sakshi

మరపురాని సంవత్సరమిది. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా మరో మెట్టు పైకి ఎక్కిన ఏడాదిది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. తదితర రంగాల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేసిన విత్తనం మొలిచి.. మొక్కై ఎదిగి.. వృక్షంగా మారి ఫలాలిచ్చింది. సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు తమ సొంత కాళ్లపై నిలిచి కుటుంబాలను ముందుకు నడుపుతుండటం ఊరూరా.. ఇంటింటా కనిపిస్తోంది. ప్రతి పల్లెలోనూ ప్రగతి వికసిస్తోంది. కొత్త పరిశ్రమలు, పచ్చటి పంటలతో శివారు ప్రాంతాలు కళకళలాడటం సాక్షాత్కరిస్తోంది.

నాడు–నేడుతో రూపు మార్చుకున్న పాఠశాలలు, నిమి­షాల వ్యవధిలో వైద్యం అందించే విలేజ్‌ క్లినిక్‌లు, రైత­న్నను చేయి పట్టుకుని వడివడిగా నడిపిస్తున్న ఆర్బీకేలు.. ప్రజల జీవన స్థితిగతుల్లో కీలక మార్పులు తేవడం గ్రామ గ్రామాన ఆవిష్కృతమైంది. పిల్లలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్‌ కావడం సంతోషాన్నిస్తోంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు పొందిన అక్కచెల్లెమ్మల్లో 22 లక్షల మంది ఇళ్లు నిర్మించు­కోవడంలో నిమగ్నమవడం కళ్లకు కడుతోంది. ఇందులో లక్షలాది మంది గృహ ప్రవేశాలతో సందడి చేయడం ఊరూరా కనిపించింది. పేద ప్రజలు అనారోగ్యం బారి­నపడితే నేనున్నానంటూ రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించడానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టడం ప్రధానంగా అమితానందాన్నిస్తోంది.   

‘హౌస్‌’ఫుల్‌ హ్యాపీ 
► రాష్ట్రంలోని లక్షలాది మంది పేదింటి అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది సొంతింటి కల నెరవేరింది. 

► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.75 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు విలువ చేసే భూముల్లో పక్కా లే అవుట్లు సిద్ధం చేసి 30.7 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మల పేరిట నివేశన స్థలాలను పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది.

► ఆ లే అవుట్లలో 17,005 వైఎస్సార్‌–జగనన్న కాలనీలు నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరుచేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున సాయం అందిస్తోంది. 

► ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,85,829 సాధారణ ఇళ్లు, 1,57,566 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. అక్టోబర్‌ 12న కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా పేదింటి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. 

► కేవలం 2023 సంవత్సరంలోనే 4.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది.

► నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ చకచకా విద్యుత్, కుళాయి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇస్తోంది.  

ప్రజారోగ్యానికి ఆరోగ్యశ్రీ ‘రక్ష’
2023లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో పలు విప్లవాత్మక కీలక పరిణామాలు చాలా చోటు చేసుకు­న్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
► డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచి.. ఆ మేరకు డిసెంబర్‌ 18వ తేదీనుంచి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్‌ కార్డులు పంపిణీ     

► గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు.. మంచానికి పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు 

► రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్‌)  అమలు 

► కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు పెద్ద ఊరటను కల్పిస్తూ..రూ.85 కోట్లతో  డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన ఆస్పత్రి నిర్మాణం. డిసెంబర్‌ 14న రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్ట్‌ ప్రారంభం.  

► ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఆ శాఖలోని నియామకాల కోసం ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు

► 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య శాఖలో 53 వేలకుపైగా పోస్టులు భర్తీ..  ప్రభుత్వ వైద్యశాఖలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ ఈ ఏడాది విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలు ప్రారంభం. 

నవరత్నాలతో నవోదయం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి అమలు చేస్తూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు సీఎం జగన్‌ నేరుగా బటన్‌ నొక్కి డైరెక్టు బెటిఫిట్‌ ట్రాన్సఫర్‌ (డీబీటీ), పరోక్షంగా (నాన్‌ డీబీటీ) అందించిన సంక్షేమ సాయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం జగన్‌ తమకు అందిçస్తున్న సంక్షేమ పథకాలు వల్లే తాము ఆనందంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నామని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలకు మేలు చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న నవరత్నాలు ద్వారా నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ.2,47,564.36కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1,67,530.95కోట్లు అందించారు. మొత్తంగా రూ.4,15,095.31కోట్లు లబ్ధిని చేకూర్చడం ఒక రికార్డు.  

సం‘క్షేమం’గా అన్నదాత

► 2023–24 సీజన్‌లో 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ ఏడాది సాయంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో రూ.33,209.13 కోట్ల పెట్టుబడి సాయం చేశారు.  

► గతేడాది రబీ సీజన్‌లో విరుచుకుపడ్డ మాండూస్‌ తుపాన్‌తో పాటు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న 1.54 లక్షల మందికి ఈ ఏడాది రూ.142 కోట్ల మేర పంటల బీమా పరిహారాన్ని జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మందికి రూ.1976.45 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించినట్టయింది.   

► ఖరీఫ్‌–2022 సీజన్‌కు సంబంధించి 10.20 లక్షల మంది రైతులకు రూ.1117.21 కోట్ల పంటల బీమా పరిహారాన్ని జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7802.05 కోట్ల మేర బీమా పరిహారం అందజేశారు.   

► ఆర్బీకేలకు అనుసంధానంగా నూరు శాతం వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో ఈ ఏడాది కొత్తగా 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్‌ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి కోసం ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంక్‌ ఖాతాలకు రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేశారు. 

► 28,112 మంది రైతుల నుంచి  337 టన్నుల శనగలు, 9027 మంది రైతుల నుంచి 71,445 టన్నుల మొక్కజొన్న, 312 మంది రైతుల నుంచి 413 టన్నుల పసుపు కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. 

► ఈ ఏడాది రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 80.76 లక్షల మందికి రూ.1.70 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారు. 8.28 లక్షల మంది కౌలుదారుల్లో 5.32 లక్షల మందికి రూ.1592.79 కోట్ల రుణాలు మంజూరు చేశారు.  నాలుగున్నరేళ్లలో రూ.1.75 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరింది.  

సస్యశ్యామలం...
► హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూల్, నంద్యాల జిల్లాల్లోని పశి్చమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని  పూర్తి చేసింది.  

► గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. 

► వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ.ల పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లలో ఇప్పటికే 7.506 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. 

► 2013–14 ధరలతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని.. తాజా ధరల మేరకు నిధులు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.  

► తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. – సాక్షి, అమరావతి

కరువు తీరేలా కరెంట్‌ 
► నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ పంపిణీకి ప్రభుత్వం విశేష కృషి. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి 14 రకాల విద్యుత్‌ సేవలు. అంతర్రాష్ట్ర విద్యుత్‌ ప్రసార చార్జీల రూపంలో రూ.304.2 కోట్ల ఆదాయం. స్మార్ట్‌ మీటర్లు, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ. 

► ఆర్డీఎస్‌ఎస్‌ పథకం ద్వారా రూ.13వేల కోట్ల అభివృద్ధి పనులు. విద్యుత్‌ ఉత్పత్తిలో దేశీయ యావరేజి కన్నా రాష్ట్రం ఎక్కువ నమోదు.  గతేడాదితో పోల్చుకుంటే విద్యుత్‌శాఖకు తక్కువ నష్టాలు. 

► డి్రస్టిబ్యూషన్‌ సెక్టార్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 12 సబ్‌స్టేషన్లు పూర్తి. కృష్ణ పట్నం యూనిట్‌లో 800 మెగావాట్లు, డాక్టర్‌ ఎనీ్టటీపీఎస్‌ యూనిట్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం. దీంతో అందుబాటులోకి 40 మిలియన్‌ యూనిట్లు. 

► నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్లతో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు. వీటి ద్వారా 5300 మందికి ఉద్యోగాలు. పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంట్లతో మరో రెండు వేలమందికి ఉద్యోగాలు.

► మార్చిలో వైజాగ్‌లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌(జీఐఎస్‌)లో ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 ఎంఓయూలు. వీటి విలువ రూ.9.57 లక్షల కోట్లు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలకు అవకాశం. కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు. 

► రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు. రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి దివంగత కారి్మక నేత డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి పేరు. 

తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ 
సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు
తేవడంతో వైఎస్సార్‌సీపీకి ఈఏడాది ప్రజల్లో భారీగా మద్దతు పెరుగుతోంది. దీంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది.  
► రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలనూ గెలిచి వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయమని టైమ్స్‌ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.  

► శాసనమండలిలో ఖాళీ అయిన 21 స్థానాలకు (ఎమ్మెల్యే కోటా 7, స్థానిక సంస్థల కోటా 9, పట్టభద్రులు 3, ఉపాధ్యాయులు 2) మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 17 స్థానాలను చేజిక్కించుకుని వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచింది. మండలిలో వైఎస్సార్‌సీపీ బలం 46కు పెరిగింది.  

► ప్రతిపక్షాల దు్రష్ఫచారాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఏప్రిల్‌ 7 నుంచి 29 వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని చేపట్టింది.
1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మమేకమయ్యాయి.  

► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చేసిన మేలును వివరించడానికి అక్టోబర్‌ 25న వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన సామాజిక సాధికార యాత్ర జన నీరాజనాల మధ్య కొనసాగుతోంది.  

► మళ్లీ వైఎస్‌ జగన్‌ను సీఎంగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడం కోసం నవంబర్‌ 9 నుంచి చేపట్టిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమానికి ప్రతి ఇంటా జనం నీరాజనాలు పలుకుతున్నారు.  

ప్రభుత్వ చదువులకు అందలం
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇచి్చన ప్రాధాన్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.దాదాపు 43 లక్షల మంది చదువుకుంటున్న 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో
తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం బోధనతో పాటు మనబడి నాడు–నేడు పథకం కింద ప్రభుత్వం సమూల మార్పులు తెచి్చంది. 

► 2022–23 విద్యా సంవత్సరంలో ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన చేపట్టడంతో పాటు, చదువులో రాణించిన ఉత్తమ విద్యార్థులను సత్కరించి ఏపీ ఆదర్శంగా నిలిచింది.  

► ఇంటర్, టెన్త్‌ల్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించి వారికి ‘జగనన్న ఆణిముత్యాలు– స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డు’లను ప్రదానం చేసింది. 
►  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10 మంది విద్యార్థులను అమెరికా పర్యటనకు పంపించారు. వారు ఐక్యరాజ్యసమితి ఎస్‌డీజీ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచ బ్యాంకు, కొలంబియా యూనివర్సిటీలను సందర్శించి వచ్చారు. 

► ఈ ఏడాది 1,000 ప్రభుత్వ స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణకు అనుమతి లభించింది.  బాలికల చదువు కోసం ప్రభుత్వం ప్రతి మండలానికి ఓ జూనియర్‌ కాలేజీని అందుబాటులోకి తెచ్చింది.  

► 3 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు టోఫెల్‌ ప్రైమరరీ, టోఫెల్‌ జూనియర్‌ సరి్టఫికేషన్‌ కోర్సులను
ప్రారంభించింది.  

► దీక్ష, ఏపీఈ–పాఠశాల డీటీహెచ్‌ చానెళ్లు, యూట్యూబ్‌ చానెళ్ల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.  

పునర్నిర్మించి...పూర్వ వైభవం తెచ్చి..! 
2016లో జరిగిన కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లకు అడ్డుగా ఉన్నాయని నాటి టీడీపీ ప్రభుత్వం కూలి్చవేసిన ఆలయాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునఃనిర్మించింది. ఈ ఆలయాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునర్నిర్మించి, 2023 డిసెంబరు 7న ప్రారంభించింది. పునఃనిర్మించిన ఆలయాల్లో 1) దక్షిణాముఖ ఆంజనేయస్వామి ఆలయం 2) సీతమ్మవారి పాదాలు 3) శ్రీసీతారామలక్ష్మణ సమేత దాసాంజనేయస్వామి ఆలయం 4) వీరబాబు ఆలయం 5) విజయవాడ గో సంరక్షణ సంఘం 6) బొడ్డు బొమ్మ 7) ఆంజనేయస్వామి, వినాయకస్వామి వార్ల ఆలయాల తొలిమొట్టు 8)శ్రీ శనైశ్వరస్వామి వారి ఆలయాలు ఉన్నాయి. వీటికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2021 జనవరి 8న శంకుస్థాపన చేసి మూడేళ్ల లోపే రూ.3.87 కోట్లతో పనులు పూర్తి చేసింది. 

పారిశ్రామిక నామ సంవత్సరం
రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని సువర్ణ అక్షరాలతో నిలిపి భవిష్యత్‌ తరాలకు కొండంత అండను అందించింది.. 2023వ సంవత్సరం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పారిశ్రామిక దిగ్గజాలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. 

► మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ముఖేష్‌ అంబానీ, కరణ్‌ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతారెడ్డి, సతీష్‌ రెడ్డి, బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, మషాహిరో యమాగుచి, ‘టెస్లా’ మార్టిన్‌ ఎబర్‌హార్డ్‌ తదితర కార్పొరేట్‌ దిగ్గజాలు హాజరయ్యారు. 


►  ఈ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. తద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభించనుంది. 
     భోగాపురం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టులు నిర్మాణ పనులు ప్రారంభించాయి. 

► ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బీఈఎల్, రాడ్‌స్టాండ్‌ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. 

► బ్లూస్టార్, డైకిన్, డిక్సన్, టీసీఎల్, మునోత్‌ తదితర అనేక ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ∙బద్వేల్‌లో ‘సెంచురీ ప్యానల్స్‌’ ఉత్పత్తిని ప్రారంభించింది. తద్వారా స్థానికంగా 2,500 మందికి ఉపాధి, 20,000 మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తోంది. 

► శ్రీసిటీలో కొత్తగా ఆరు కంపెనీలు నిర్మాణ పనులు మొదలు పెట్టగా.. 18 కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. పలు ప్రముఖ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 

Advertisement
Advertisement