AP Political News Dec 31st: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Political News Dec 31st: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sun, Dec 31 2023 7:17 AM

AP Elections Today Political News Updates And Headlines December 31st In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

4:18PM, డిసెంబర్‌ 31, 2023

చంద్రబాబు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి

  • 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు సీఎంగా చేయని అభివృద్ధి కుప్పంకు సీఎం జగన్‌ చేసి చూపించారు
  • కుప్పం నియోజకవర్గంకు సాగు, తాగు, నీరు కూడా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో చేయలేకపోయాడు చంద్రబాబు
  • కుప్పంకు సీఎం జగన్ పాలనలో సాగునీరు అందిస్తున్నారు
  • కుప్పం మున్సిపాలిటీ, కుప్పంకు ఆర్డీవో కార్యాలయం ఇచ్చింది సీఎం జగన్‌
  • చంద్రబాబు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
  • చంద్రబాబు అధికారంలో ఉన్న రోజుల్లో సంపద సృష్టించడం చేతకాలేదు, ఇప్పుడు కళ్ళ బొల్లి మాటలు. చెప్తున్నాడు

3:30PM, డిసెంబర్‌ 31, 2023

గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం ఆత్మీయ సమావేశం

  • నేను న్యాయవాది వృత్తితోనే జీవితం ప్రారంభించాను
  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందరికన్నా ముందు అండగా నిలిచింది న్యాయవాదులే
  • పార్టీ కోసం పనిచేసిన అందరికీ అవకాశాలు వస్తాయి
  • కానీ కొంత సమయం ఓపిక పట్టాలి
  • సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ కేసులలో ఇరికించి 16 నెలలు జైల్లో ఉంచారు
  • కానీ చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉంటేనే ఏడుస్తున్నాడు బెయిల్‌ కూడా వచ్చింది
  • చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దింపుతానంటున్నాడు
  • కానీ ప్రజలు మాత్రం జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామంటున్నారు
  • 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపునకు న్యాయవాదులు కీలక పాత్రపోషించాలి
    -మంత్రి అంబటి రాంబాబు

  • న్యాయవాదులకు సీఎం జగన్‌ పూర్తి స్థాయిలో గుర్తింపు ఇచ్చారు
  • జూనియర్‌ న్యాయవాదలు కోసం లా నేస్త పథకాన్ని అమలు చేస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు
  • ప్రభుత్వం న్యాయవాదులకు మద్దతుగా ఉంది
  • సామాన్యుడికి భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
  • బడుగు, బలహీన వర్గాలకు బ్యాక్‌బ్యాన్‌గా నిలిచిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
    -మంత్రి విడదల రజని

  • ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అ‍డ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారు
  • దేశంలో ఎక్కడా లేనివిధంగా 31 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే దానితో అడ్డుకోవడానికి ప్రతిపక్షలు హైకోర్టులో కేసులు వేశాయి
  • ప్రభుత్వంపై హైకోర్టులో వేసే కేసులను ఎదుర్కోవడానికి హైకోర్టు అడ్వకేట్లు బాగా కష్టపడ్డారు
  • చివరకు హైకోర్టు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మారిందన్న చర్చ ప్రజల్లో జరిగింది
  • జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే ఒకవైపు మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మరొకవైపు..
  • ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మనం అందరికీ తెలియచెయ్యాలి
    -మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్రాధ్యక్షుడు

02:02 PM, డిసెంబర్‌ 31, 2023
అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని చూసి.. ఇప్పుడు నీతులు చెబుతావా లోకేష్‌

  • మేము అగ్రి గోల్డ్ బాధితులకు 7 కోట్లు (ఆత్మహత్య చేసుకున్న 142  మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ) ఇచ్చాం: లోకేష్‌
  • రాష్ట్రంలో 11 .57  లక్షల  మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్‌ సంస్థలో  డిపాజిట్‌ చేశారు
  • వారిలో 20 వేలు లోపు డిపాజిట్‌ చేసినవారికి  "930 కోట్లు చెల్లించి" 10.37లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారు సీఎం జగన్ 
  • మిగిలిన వారికి కూడా డిపాజిట్‌ మొత్తం చెల్లించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  • అగ్రి గోల్డ్ ఆస్తులను ఈడీ   అటాచ్ చేయడం తో ఏలూరు  కోర్ట్ లో కేసు వేసి పోరాడుతోంది జగన్ ప్రభుత్వం
  • అసలు అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే
  • అగ్రిగోల్డ్‌ సంస్థ 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది
  • అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పంతం పట్టారు
  • టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి
  • అందుకోసం అగ్రిగోల్డ్‌ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది
  • ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది
  • అగ్రిగోల్డ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016 ఏప్రిల్‌ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం
  • అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీ అయిన రామ్‌ ఆవాస్‌ రిసార్ట్స్, హోటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకర్‌ నుంచి 14 ఎకరాలు కొన్నది
  • అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు
  • రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు

12:06 PM, డిసెంబర్‌ 31, 2023
చంద్రబాబు, పవన్‌కు రాష్ట్ర అభివృద్ది కనిపించడం లేదా?: మంత్రి జోగి రమేష్‌ 

  • ఏ ఆధారాలతో పవన్‌.. ప్రధానికి లేఖ రాశారు
  • పవన్‌కు ఏపీలో ఆధార్‌ కార్డు లేదు, ఓటు లేదు
  • చంద్రబాబు తాబేదారుగా పవన్‌ పనిచేస్తున్నారు
  • చంద్రబాబు కోసం పవన్‌ ఏ గడ్డయినా తింటారు
  • ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదు
  • 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించడం లేదా?
  • అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం మాది
  • పట్టాలతో సరిపెట్టకుండా 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం
  • ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారు.
  • ఏం స్కాం జరుగుతుందో పవన్‌ చెప్పాలి
  • పవన్‌కు కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం మీద పవన్‌ ఎందుకు లేఖ రాయలేదు?
  • చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై పవన్‌ ఎందుకు స్పందించరు
  • స్కిల్‌ స్కాంలో పవన్‌కు వాటా ఉంది
  • చంద్రబాబు ఇళ్లు ఇస్తానని మోసం చేశాడు
  • అప్పుడు పవన్‌ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు
  • హమీలు అమలు చేయని చంద్రబాబును పవన్‌ ప్రశ్నించాడా?
  • డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయని చంద్రబాబును ప్రశ్నించావా?
  • 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో​ పవన్‌ ప్రశ్నించారా?
  • పవన్‌కు బుద్ది ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలి
  • చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా
  • ఏ గ్రామానికైనా వెళదాం.. ఎవరు ఇల్లు ఇచ్చారో​ అడుగుదాం
  • ఏ సంక్షేమ పథకం ఎవరు అమలు చేశారో ప్రజలనే అడుగుదాం

10:37 AM, డిసెంబర్‌ 31, 2023
జయహో బీసీ పేరుతో టీడీపీ కొత్త డ్రామా: ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌

  • బీసీల­ను మరో­సారి మోసం చేసేందుకు జ­యహో బీసీ పేరుతో టీ­డీపీ కొత్త డ్రామా
  • టీడీపీ జరప­బోయేది జయహో బీసీ సభ కాదు.. బీసీ నయ­వంచన సభ
  • ఎన్నికలకు ముందు బీసీలకు రక్షణ చట్టం, ప్రత్యేక మేనిఫెస్టో అంటూ టీడీపీ చె­బుతున్న మాయమాటలను  నమ్మేస్థితిలో బీసీ­లు లేరు
  • బీసీలను ఓటు బ్యాంక్‌గా వా­డుకున్నారు
  • చంద్రబాబు అధి­కా­రంలో ఉన్నప్పుడు కు­ప్పంలో లక్షకుపైగా ఉన్న బీసీలు, చేతి వృత్తు­లవారు పనుల కోసం నిత్యం బెంగళూరు వెళుతుంటే కనీసం వారికి ఉపాధి చూపలేదు
  • ఇప్పుడు రాష్ట్రంలోని బీసీలను ఉద్ధరిస్తానంటే ఎలా నమ్ము­తారు
  • గతంలో మంత్రిగా పని చేసిన లోకేశ్‌ మంగళగిరిలో అత్య­ధి­కంగా ఉండే బీసీలకు ఏం చేశారు?
  • బీ­సీలకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్‌ను బీ­సీలు ఎప్పుడో గుండెల్లో పెట్టుకున్నారు
  • బీసీల గురించి ఏనాడూ మాట్లాడని పవన్‌తో టీడీపీ పొత్తుపై బీసీలు అసహ్యించుకుంటున్నారు

09:25 AM, డిసెంబర్‌ 31, 2023
ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌ కాపులకు మేలు చేశాడా?..  కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు 

  • కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికి పవన్‌ ఎవరు?..  
  • ఏనాడైనా పవన్‌ కళ్యాణ్‌ కాపులకు మేలు చేశాడా?  
  • కాపు కులాన్ని ఏమైనా పవన్‌కు అద్దెకు ఇచ్చామా?
  • కాపులను కట్టగట్టి అమ్మేయాలని పవన్‌ చూస్తున్నారు
  • కాపులను అమ్మేసే పవన్‌  కళ్యాణ్‌ కావాలా? కాపులను గౌరవించి కాపు కాస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కావాలా?
  • అనే విషయాన్ని కాపులంతా విజ్ఞతతో ఆలోచించాలి
  • కాపులను అణచి వేసేందుకు బాబు కుట్ర చేస్తుంటే అందులో పవన్‌ భాగస్తుడయ్యాడు
  • ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్టు చెబుతున్న పవన్‌.. నాడు వంగవీటి రంగాను హత్య చేసిన టీడీపీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు
  • ముద్రగడ పద్మనాభం ఆత్మగౌరవాన్ని రోడ్డుకీడ్చినా కనీసం ప్రశ్నించలేదు
  • ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుపై ఒక సామాజికవర్గం దాడి చేస్తే.. పవన్‌ కనీసం పట్టించుకోలేదు
  • గతంలో వైఎస్సార్‌ మాత్రమే కాపులకు పెద్దపీట వేయగా, కాపులను చంద్రబాబు ఎక్కడికక్కడ అణిచివేసి, జైల్లో పెట్టించారు
     

07:52 AM, డిసెంబర్‌ 31, 2023
స్కాం అనడానికి ఆధారాలున్నాయా పవన్‌?

  • ప్రధానికి రాసిన లేఖపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ స్పందన 
  • ఇళ్ల స్థలాల్లో రూ.35 వేల కోట్ల స్కాం జరిగిందనడానికి ఆధారాలు చూపిస్తావా పవన్‌కళ్యాణ్‌ 
  • ప్రధాని మోదీకి లేఖ రాసిన పవన్‌ను అవినీతి ఎలా జరిగిందని అడిగితే తింగరిముఖం వేసుకుని చూడాలి
  • ఈ విషయంపై సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్‌కళ్యాణ్‌ ఇంటర్‌పోల్‌ను మర్చిపోయాడు
  • దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే
  • జనసేన పార్టీలో  తమ నాయకులు నెగ్గుతారో లేదో చూడకుండా..  చంద్రబాబుకు పవన్‌ ఊడిగం చేస్తున్నాడు
  • కాపులు నాకు ఓట్లు వేయలేదు అంటున్నావ్, మరి నీకు ఎవరు ఓట్లు వేశారో చెప్పు
  •  చంద్రబాబు హయాంలో స్కిల్, అమరావతి భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, పైబర్‌నెట్‌.. ఇలా  అన్నీ స్కాములే
  • ఆ స్కాముల్లో నీకు కూడా వాటా ఉందా పవన్‌కళ్యాణ్‌?
  • ఎలాంటి అధారాలు లేకుండా చంద్రబాబు పాడిన పాటనే పవన్‌ రాగం అందుకుంటున్నాడు 

07:27 AM, డిసెంబర్‌ 31, 2023
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు

  • 3న విచారణకు రండి..
  • సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తల నరికి తెస్తే రూ.కోటి ఇస్తానన్న కొలికపూడి  శ్రీనివాసరావు
  • వర్మను ఇంటికెళ్లి తగలబెడతానంటూ టీవీ5 లైవ్‌లో హెచ్చరికలు
  • తనను చంపేందుకు బహిరంగంగా సుపారీ ఆఫర్‌ చేయడంపై వర్మ ఫిర్యాదు 
  • కొలికపూడి, సాంబశివరావు, బీఆర్‌ నాయుడుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

07:20 AM, డిసెంబర్‌ 31, 2023
కాకినాడలో కొలిక్కిరాని పవన్‌ కళ్యాణ్‌ కసరత్తులు

  • తూర్పుగోదావరిలో తప్పుతున్న పవన్‌ అంచనాలు
  • ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అద్భుత ఫలితాలు వస్తాయని తొలుత పవన్‌కు చెప్పిన నేతలు
  • తీరా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు
  • నియోజకవర్గాల వారీగా పవన్‌ చేస్తోన్న సమీక్షల్లో తేడా కొడుతోన్న పరిస్థితులు
  • కాకినాడలోనే మకాం వేసి జనసేన నేతలను కలుస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
  • చాలా వరకు మీడియాకు అనుమతి లేకుండా అంతర్గత సమావేశాలు
  • తమ అంచనాకు భిన్నంగా పరిస్థితి ఉందని తేల్చుతున్న నివేదికలు
  • కాకినాడలో 15 డివిజన్ల కార్యకర్తలతో పవన్ భేటీ 
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జులతో సమావేశం 
  • మొన్న రాత్రి పవన్ ను కలిసిన జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
  • అసలు తెలుగుదేశం-జనసేన కలిసి పని చేసే పరిస్థితి లేదని చెప్పిన చంటిబాబు

07:18 AM, డిసెంబర్‌ 31, 2023
విశాఖ: తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీటు

  • ఎంపీ సీటుకు రూ.150 కోట్లు, ఎమ్మెల్యే సీటుకు రూ.50 కోట్లు ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని కండీషన్‌
  • ఖర్చు చేయగలిగిన వారికే పార్టీలో సీట్లంటున్న చంద్రబాబు
  • 3 ప్రాంతాల్లో డిపాజిట్‌ మొదలు పెట్టిన చంద్రబాబు
  • బాబు తీరుపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • రూ.కోట్లు ఉంటే సీట్లు అంటున్న బాబు వైఖరిపై ఆగ్రహం
  • కష్టపడే వారికి పార్టీలో విలువ లేదంటూ మండిపాటు

Advertisement

తప్పక చదవండి

Advertisement