డిసెంబర్‌లోపే తెలంగాణ

6 Oct, 2013 02:50 IST|Sakshi

పాపన్నపేట, న్యూస్‌లైన్:  డిసెంబర్‌లోపేప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏడుపాయల దుర్గా భవానీ శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సకలజనుల ఉద్యమం, యువకుల పోరాటం, తెలంగాణ ప్రక్రియకు తోడ్పడ్డాయన్నారు. 2009 డిసెంబర్ 9న ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నోట్ తయారు చేసి కేంద్ర కేబినెట్ చేత ఆమోదింపజేసిందన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందన్నారు.
 
 హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ డిసెంబర్‌లోగా ఏర్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చూపిన చొరవ మరువలేనిదన్నారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రుల బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి సీమాంధ్రులు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అన్నదమ్ముల్లా వీడిపోయి,అత్మీయులుగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింలుగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లప్ప, కాంగ్రెస్ నాయకులు రమేష్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిరుద్యోగులకు టోపీ

స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం

జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం..

నిష్పక్షపాతమే మా విధానం

సీఎంతో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

880 మద్యం దుకాణాల తగ్గింపు

పక్కాగా భూ హక్కులు

అపూర్వ ‘స్పందన’

నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష

ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు

విద్యా వ్యవస్థకు నవోదయం

విద్య వ్యాపారం కాదు.. సేవ మాత్రమే: సీఎం జగన్‌

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

సీఎం జగన్‌కు జపాన్‌ ఆహ్వానం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

32 లక్షల మంది వంచనకు గురయ్యారు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

సంగం డైరీలో దొంగలు పడ్డారు

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను