1న మోదీ షెడ్యూల్‌ ఖరారు

27 Sep, 2023 04:36 IST|Sakshi

మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రాక

బేగంపేటలో ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల 1న (అక్టోబర్‌) ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్‌ శివార్లలోని భూత్పూర్‌లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్‌ హెలీపాడ్‌ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్‌ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్‌లో రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

మరిన్ని వార్తలు