ముంపులోనే లంక గ్రామాలు

6 Aug, 2013 00:52 IST|Sakshi

 యలమంచిలి, న్యూస్‌లైన్ : గోదావరి వరద ఉధృతి తగ్గినప్పటికీ లంక గ్రామాలు వరుసగా మూడోరోజు కూడా ముంపులోనే ఉన్నాయి. ఆదివారంతో పోల్చుకుంటే ఒకడుగు నీరు తగ్గింది. అమావాస్య రోజులు కావడంతో వరదనీరు త్వరగా లాగుతోందని భావిస్తున్నారు. కనకాయలంక, పెదలంక, లక్ష్మీపాలెం, బాడవ గ్రామాలు పూర్తిగాను, యలమంచిలిలంక, కంచుస్తంభంపాలెం, బూరుగుపల్లి, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాలలో పాక్షికంగా నీరు చేరింది. దొడ్డిపట్ల హైస్కూల్, కనకాయలంక తుఫాన్ షెల్టర్, లక్ష్మీపాలెం యూపీ స్కూల్, బాడవ యూపీ స్కూల్, పెదలంక ప్రాథమిక పాఠశాల, వాకలగరువు ప్రాథమిక పాఠశాల, గంగడపాలెం ప్రాథమిక పాఠశాల, అబ్బిరాజుపాలెం ప్రాథమిక పాఠశాలల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. వరద బాధితులు 6,273 మందికి సోమవారం అల్పాహారంతోపాటు, భోజనాలు పెట్టారు. గోదావరి పైభాగం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో పైనుంచి వచ్చే నీటి వలన మంగళవారం గ్రామాల్లో మరింత వరదనీరు పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రత్యేక అధికారి ఎన్ రామచంద్రారెడ్డి, తహసిల్దార్ చాగలకొండు గురుప్రసాదరావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
 
 కేదారీఘాట్‌లో తగ్గని నీరు
 సిద్ధాంతం(పెనుగొండ రూరల్) : ఆదివారం నాటి పరిస్థితే సిద్ధాంతంలో కొనసాగింది. వెంకటేశ్వరస్వామి, కేదారేశ్వర స్వామి ఆలయాలు నీటి ముంపులోనే ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరుగాం చిన కేదారీ ఘాట్ శ్మశాన వాటిక  ము నిగి పోవడంతో దహన సంస్కారాలు ఏటిగట్టుపైనే చేస్తున్నారు. ఎవరూ లో ని కి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూరగాయల పా దు లన్నీ నీట మునిగాయి. కోక్ తో టలు, అరటి తోటలు పూర్తిగా దెబ్బతి న్నాయి. భద్రాచలంలో నీటి మట్టం త గ్గుతుండడంతో మంగళవారం నుంచి ఈ ప్రాంతంలో తీ వ్ర త తగ్గవచ్చునని భావిస్తున్నారు. మ ద్యస్థలంకలోకి రాకపోకలపై నియంత్ర ణ విధించారు. పడవలపై ఎవరూ గో దావరిలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టా రు. ఏటిగట్టు పొడవునా ప్రత్యేక కాపలా పెట్టా రు. పెనుగొండ త హసిల్దార్ జీజేఎస్ కుమార్ పర్యవేకిస్తున్నారు.

మరిన్ని వార్తలు