‘ఫిబ్రవరి 1లోగా ప్రభుత్వం స్పందించకుంటే బంద్‌ చేస్తాం’

31 Jan, 2019 12:41 IST|Sakshi

సాక్షి, తిరుమల : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తిరుమల వాసుల చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. తరతరాలుగా తిరమల కొండను నమ్ముకోని బతుకుతున్న తమను టీటీడీ ఆదుకోవడంలేదని స్థానికులు బుధవారం నుంచి ఆందోళను దిగారు. మూడు రోజులపాటు జరిగే నిరసనలోభాగంగా గురువారం టీడీడీ పరిపాలనా భవనం ఎదుట దీక్షకు దిగారు. శుక్రవారంలోగా(ఫిబ్రవరి 1) ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే షట్‌ డౌన్‌ పేరుతో బంద్‌ చేస్తామని హెచ్చరించారు. వీరి ఆందోళనకు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ప్రకటించింది.

తిరుమల వాసుల ప్రధాన డిమాండ్లు 

  • తిరుమల నిర్వాసితులను ఆదుకోవాలి.
  • బాలాజీనగర్, ఆర్‌బీ సెంటర్‌లో నివసిస్తున్న స్థానికులకు మౌలిక వసతులు కల్పించాలి.
  • టెండర్‌షాపులకు బాడుగలు కట్టించుకుని రెగ్యులరైజ్‌ చేయాలి.
  • అర్హులైన స్థానికులకు హాకర్స్‌ లైసెన్స్‌లు కేటాయించి, ఫీజులను తగ్గించాలి.
  • అన్ని ప్రాంతాల షాపులకు ఫిక్స్‌డ్‌ రెంట్‌ అమలు చేయాలి.
  • పాపవినాశనం వ్యాపారులకు న్యాయం చేయాలి.
  • 10 సంవత్సరాల ముందు ఇచ్చిన ట్రేడ్‌ లైసెన్స్‌లను కొనసాగించాలి.
  • అలిపిరి టోల్‌గేట్‌లో ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేయాలి.
  • షాపింగ్‌ సెంటర్, సబ్‌వేలలో దుకాణాలను వ్యాపారం జరిగే ప్రాంతాలకు తరలించాలి.
  • హోటల్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా స్థానికులకు కేటాయించాలి.
  • తిరుమలలో స్థానికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. 
మరిన్ని వార్తలు