మకర వేట చూసొద్దాం రండి

16 Jan, 2014 06:46 IST|Sakshi

సింహాచలం, న్యూస్‌లైన్ : కనుమ పండగను పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ  లక్ష్మీనృసింహ స్వా మి మకరవేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూల తోటలో సాయంత్రం ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించేందుకు దేవస్థానం వైదిక, అధికార వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి.  వరదరాజస్వామి అలంకారం లో అప్పన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు.

గజవాహనంపై  గ్రామ తిరువీధిలో భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు. ఈ వేడుకలో భాగంగా గజేంద్రమోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం పూలతోట నుంచి స్వామిని మార్కెట్ కూడలిలో ఉన్న పుష్కరిణి సత్రంలోకి తీసుకొచ్చి విశేష ఆరాధనలు జరిపి గజవాహనంపై తిరువీధి మహోత్సవాన్ని జరుపుతారు. తిరువీధి అనంతరం స్వామిని తిరిగి కొండపైకి చేర్చుతారు.

 విస్తృత ఏర్పాట్లు
 మకరవేట ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవం జరిగే పది ఎకరాల ఉద్యానవనానికి నూతన శోభను చేకూర్చారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో గట్టి పోలీస్  బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు