ఈనాటి ముఖ్యాంశాలు

30 Jul, 2019 19:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి  జయశంకర్‌ను కలిశారు. దాయాది పాకిస్తాన్ చెరలో ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని ఆయనను కోరారు. జాలర్లతో వారి కుటుంబసభ్యులు మాట్లాడేందుకు  దౌత్య అనుమతి ఇప్పించాలని కేంద్రమంత్రిని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పటైన బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టిప్పు జయంతి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. టిప్పు జయంతి ఉత్సవాలు జరపరాదని కన్నడ, సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ హెగ్దే కగేరి నియామకం దాదాపు ఖరారు అయ్యింది. కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ అదృశ్యం సంచలనంగా మారింది. సోమవారం రాత్రి దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌ బ్రిడ్జిపై ఫోన్‌లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన సిద్దార్థ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు