ఈనాటి ముఖ్యాంశాలు

19 Jul, 2019 19:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​ అధ్యక్షతన శుక్రవారం భేటీ అయిన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21–14,  21–7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్‌)పై వరుస సెట్లలో విజయం సాధించింది. ప్రముఖ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు