ఈనాటి ముఖ్యాంశాలు

29 Nov, 2019 20:04 IST|Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యకేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో పూర్తిగా విఫలమై.... నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి శుక్రవారం ఆరోపించారు. రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద రాష్ట్రానికి రావలసిన రూ.2,246 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. భోపాల్‌ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు