గిరిజన సమస్యలను పరిష్కరించండి

18 Jul, 2015 00:34 IST|Sakshi

 సీతంపేట: గిరిజ నులు ఎదుర్కొం టున్న సమస్యల ను పరిష్కరించి.. వారి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విశ్వాస రాయి కళావతి ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి జల్లేపల్లి వెంకటరావును శుక్రవారం కలిసి కోరారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలోని అధికారులు ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఎటువంటి పథకాలు అమలు చేస్తున్నారనేది ప్రజాప్రతినిధులకు తెలియడం లేదని పీవో దృష్టికి తీసుకువచ్చారు. పథకాలు అమలు చేసినపుడు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యలు, ఇతర ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, అయితే ఇందుకు విరుద్ధంగా ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో పనిచేసిన  పీవో ఇలాగే నిర్లక్ష్యం వహించారని వ్యాఖ్యానించారు.
 
  ఐటీడీఏకు 20 మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, గిరిజనులు అర్జీలు పట్టుకుని వస్తుంటారని, అయితే వారు వేచి ఉండడానికి ఎటువంటి భవనం లేక పోవడంతో చెట్ల కింద కూర్చోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్నారు. చివరకు నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురౌతుందన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేలా చూడాలని, గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పించాలని పీవోను కోరారు. దీనికి పీవో స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అందుబాటులో ఉంటానన్నారు. ఎప్పుడైనా.. ఎవరైనా కలవచ్చన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ సవర లక్ష్మి, జెడ్‌పీటీసీ సభ్యుడు పాలకరాజబాబు, మండల కో ఆప్షన్ సభ్యుడు మూర మోహన్‌రావు, ఎంపీటీసీ సభ్యురాలు బిడ్డిక జయలక్ష్మి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు