గొట్టపు బావులపై నియంత్రణ

3 Apr, 2015 02:06 IST|Sakshi
  • కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొట్టపు బావులు (బోర్‌వెల్స్) వేయడంపై నియంత్రణ ఉంచాలని అధికారులను సీఎం చంద్రబాబుఆదేశించారు. అడుగంటిన భూగర్భజలాలను పెంచేందుకు జల సంరక్షణ నిర్మాణాలను పూర్తిచేయాలని చెప్పారు. ఆయన గురువారం జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో ఏడు ప్రాజెక్టుల పూర్తికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.మహిళా సంఘాలతో ఇసుక అమ్మించటం వల్ల ఐదు నెలల్లో ప్రభుత్వానికి రూ.345 కోట్లు వచ్చినట్లు చెప్పారు. ఇసుక విక్రయాల క్రమబద్ధీకరణకు అన్ని పురపాలక సంఘాల్లో డిపోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొమ్మిది పట్టణాల్లో డిపోలు ప్రారంభించామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు