గూగుల్‌లో చూసి.. రష్యా నుంచి హార్సిలీహిల్స్‌కు!

18 Nov, 2019 19:43 IST|Sakshi

కొండ వాతావరణానికి ముగ్దులైన రష్యన్లు 

ఏపీ టూరిజం పనితీరు భేష్‌!

బి.కొత్తకోట : ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో పర్యటించినా ఏపీ టూరిజంలా ఎక్కడా లేదని రష్యాకు చెందిన పర్యాటకులు డేనియల్, దిమిత్రి తెలిపారు. మిత్రులైన వీరు రష్యాలోని మాస్కోలో వృత్తిపరమైన వ్యాపారం చేసుకొంటూ జీవిస్తున్నారు. వీరికి పర్యాటక ప్రాంతాల సందర్శన అంటే ఇష్టం. పర్యాటక స్థలాల గురించి గూగుల్‌లో వెతుకుతుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ గురించి తెలుసుకొన్నారు. బెంగళూరులో ఉన్న ప్రాంతాలు చూసుకుని ఆదివారం హార్సిలీహిల్స్‌ చేరుకున్నారు. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని కొండపైనున్న ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడి మొక్కలు, యూకలిప్టస్‌ వృక్షాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం తమ హాబీ అని తెలిపారు. గూగుల్‌లో హార్సిలీహిల్స్‌ గురించి తెలుసుకొని వచ్చామన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు, చల్లటి వాతావరణం మరెక్కడా చూడలేదని వివరించారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ టూరిజంశాఖ నిర్వహణ, పనితీరు బాగుందని వారు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు