వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు

27 Aug, 2016 03:38 IST|Sakshi
వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు
పెనుగొండ: పంచ లోహాలతో తయారు చేసిన వాసవీ అమ్మవారి పాదాలివి. దీనికి 1.55 టన్నుల పంచ లోహాలను వినియోగించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతి ధామ్‌లో నెలకొల్పనున్న 90 అడుగుల వాసవీ మాత పంచ లోహ విగ్రహానికి వీటిని అమర్చనున్నారు.

రూ.20 కోట్ల వ్యయంతో 45 టన్నుల పంచ లోహాలతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అమ్మవారి నిజ పాదుకలుగా పేర్కొంటున్న వీటిని 2014 ఆగస్టు 17న బెంగళూరు మల్లేశ్వరం క్రీడా మైదానంలో వాసవీ పీఠాధిపతులు, స్వామీజీలు ఆవిష్కరించారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా దేశం నలుమూలలా సుమారు 21,500 కిలోమీటర్ల మేర వీటిని రథంలో ఊరేగించి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శింపచేశారు. శనివారం వీటిని పెనుగొండలోని వాసవీ శాంతిధామ్‌లో ప్రతిష్ఠించనున్నారు.
మరిన్ని వార్తలు