విపత్తులు ఎదుర్కొనేందుకు సదా సన్నద్ధతతో ఉంటాం

2 Dec, 2017 04:14 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న తూర్పు నౌకాదళ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌

తూర్పు నౌకాదళ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌

విశాఖ సిటీ: భారత సాగర తీరంలో శాంతి భద్రతల్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తూర్పు నౌకాదళం సేవలందిస్తోందని ఈఎన్‌సీ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. జాతీయ విపత్తులను ఎదుర్కొనేందుకు నౌకాదళం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. నౌకాదళంలో సబ్‌మెరైన్‌ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న సబ్‌మెరైన్‌ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు కరమ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. 1968లో సేవలు ప్రారంభించిన తూర్పు నౌకాదళానికి 2018 మార్చి నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ డిసెంబర్‌ 7, 8 తేదీల్లో జరిగే స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు