15 రోజుల్లో కొత్త ఐటీ విధానంపై ప్రకటన

15 Jul, 2014 12:50 IST|Sakshi

విశాఖ : ఐటీ సెజ్ల్లో భూములను తీసుకుని వాటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం విశాఖ జిల్లా మధురవాడలోని ఐటీ సెజ్ను సందర్శించారు. అనంతరం మంత్రి పల్లె రఘునాథరెడ్డి  మాట్లాడుతూ ఐటీలో సింగిల్ విండో విధానం అమలు వల్ల కొత్త ఐటీ దారులకు ఎంతో ఊతమిస్తుందన్నారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ15 రోజుల్లోగా కొత్త ఐటీ విధానాన్ని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖను ఐటీ హబ్ గా చేస్తామని తెలిపారు.

అనంతరం ఐటీ పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి .... వీటా, రిట్పా సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు. ఐటీ సెజ్లో మౌలిక సదుపాయాల కొరతపై పారిశ్రామక వేత్తలు ఈ సందర్భంగా మంత్రులకు నివేదిక అందించారు.రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుడు జె సత్యనారాయణ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, పరిశ్రమల అభివృద్ధి ఫోరం చైర్మన్ జె.ఎ.చౌదరి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు