‘గ్యాస్ కేటాయిస్తున్నారో లేదో చెప్పండి ?’

31 Mar, 2015 01:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్ గ్యాస్‌ను రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తున్నారో? లేదో ? చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భొసాలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెలికితీసిన గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, కేజీ బేసిన్ గ్యాస్‌ను రాష్ట్రానికి కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ జన పాలన పార్టీ అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు