మహిళపై కత్తితో దాడి

5 Jun, 2014 02:05 IST|Sakshi
మహిళపై కత్తితో దాడి

 శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : చిన్నపిల్లాడితో వచ్చిన వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది. క్షణికావేశంతో జరిగిన ఈ ఘటన ఒక వ్యక్తిని జైలుపాల్జేసింది. మరో మహిళ ఆస్పత్రి పాలైంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న వానపల్లి దేవి ఇంటికి పొరుగున ఒక ఇల్లు తనఖాకు తీసుకుని ఏడాదిగా పట్నాల శ్రీనివాస్, కృష్ణవేణి దంపతులు ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. శ్రీనివాస్ విశాఖ రైల్వేలో కాంట్రాక్ట్ కూలీగా పనిచేస్తున్నాడు. కృష్ణవేణి బ్యూటీషియన్ శిక్షణ తీసుకుంటోంది. బుధవారం తనను వానపల్లి రవి, అతని తల్లి వానపల్లి దేవిలు కొట్టి, అవమానించారని కృష్ణవేణి ఫోన్‌లో భర్త శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. దీంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు.
 
 వేటకత్తి తీసుకుని వానపల్లి దేవి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. దీంతో వానపల్లి దేవికి వీపుపైన, ఎడమ చేతిపైన గాయూలయ్యూరుు. ఈ దాడిలో రాజేశ్వరి అనే మహిళ త్రుటిలో తప్పించుకుంది. శ్రీనివాస్ అక్కడితో ఆగకుండా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ బయటకు తెచ్చాడు. గ్యాస్ లీక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి ఎవరైనా వస్తే నిప్పు పెడతానంటూ కత్తి చేత పట్టుకుని వీధిలో పరుగులు తీసి వీరంగం చేశాడు. దీంతో వీధిలో జనం ఇళ్లలో దూరి తలుపులు మూసుకున్నారు. శ్రీనివాస్ భార్య కృష్ణవేణి కూడా శరీరంపై పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలని, లేకుంటే నిప్పు పెట్టుకుంటానంటూ హల్‌చల్ చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై సాగర్‌బాబు, పీసీలు విజయ్, ప్రతాప్ శ్రీనివాసకాలనీకి చేరుకున్నారు. పోలీసులను చూసినా వారిద్దరూ శాంతించలేదు. అతి కష్టంమీద వారి వద్ద ఉన్న  కత్తి, సిలిండర్‌లను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలను స్టేషన్‌కు తరలించారు. దాడిలో గాయపడిన దేవిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
 
 బట్టలూడదూసి అవమానించారు...
 ఈ ఘటనపై పట్నాల కృష్ణవేణి మాట్లాడుతూ.. తన కొడుకు సతీష్‌కుమార్‌ను వానపల్లి రవి గుట్కా తెమ్మని చెప్పాడని తెలిపింది. సతీష్ నిరాకరించడంతో రవి తీవ్రంగా కొట్టాడని చెప్పింది. దీనిపై తాను వెళ్లి రవి కుటుంబ సభ్యులను నిలదీశానని, దీంతో నాచేయి వెనక్కి విరిచి, దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఇంతలో అతని తల్లి దేవి వచ్చి కొబ్బరిమట్టతో తనను తీవ్రంగా కొట్టిందని పేర్కొంది. తాను ఇంటికి పారిపోయి భర్తకు ఫోన్ చేశానని, అదే సమయంలో వానపల్లి దేవి వీధిలోని పది మందికి పైగా స్థానికులను తీసుకొచ్చి, తన దుస్తులు ఊడదీసి అవమానం చేశారని వాపోరుుంది.
 
 హత్యకు యత్నించారు..
 దాడిలో గాయపడిన దేవి మాట్లాడుతూ.. తన కుమారుడు రవిపై కృష్ణవేణి చేరుు చేసుకుందని, అందుకే ఆమెను మందలించానని తెలిపింది. ఈలోగా ఆమె భర్త వచ్చి కత్తితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు