నీటి సమస్యపై భగ్గుమన్న మహిళలు

23 May, 2016 08:07 IST|Sakshi
నీటి సమస్యపై భగ్గుమన్న మహిళలు

గుత్తి : ‘‘గుక్కెడు నీటి కోసం అల్లాడుతు న్నాం. ఎన్నిసార్లు సమస్య విన్నవించినా పట్టించుకోవడం లేదు. మీరైనా సమస్య పరిష్కరించండి. లేకుంటే ఇక్కడి నుంచి కది లేది లేదు.’’ అంటూ మహిళలు మినీ మహా నాడులో టీడీపీ నాయకులపై మండిపడ్డారు. పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కాలేజ్ క్రీడామైదానంలో ఆదివారం టీడీపీ నాయకులు మినీ మహానాడు నిర్వహించారు. మంత్రి పల్లెతో పాటు ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ తమ ప్రభుత్వం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. చివరగా గుంతకల్ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ మాట్లాడుతుండగానే గుత్తి ఆర్‌ఎస్ ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 70 మంది మహిళలు ఒక్కసారిగా మినీ మహానాడు వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీన్ని గమనించిన ఎస్సీ సెల్  రాష్ట్ర కార్యదర్శి దిల్కా శ్రీనా, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాసచౌదరి, గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్,

సర్దిజెప్పినా వినలేదు. తాగునీటి సమస్యను పరిష్కరించేవరకూ ఇక్కడి నుంచి కదలబోమన్నారు. దీంతో ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ తన ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ముగించి ఆందోళన చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి సర్దిజెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినలేదు. 20 రోజుల కోకసారి కూడా తాగునీటిని వదలడం లేదన్నారు. నీటి సమస్యలను తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించుకున్నారు. దీంతో వెంటనే తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడంతో మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి: ఈ సందర్భంగా పట్టణానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళ డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని నినాదాలు చేసింది. దీన్ని గమనించిన టీడీపీ నాయకులు, పోలీసులు ఆమెను వారించారు.

>
మరిన్ని వార్తలు