నేటి పర్యటన వివరాలు

21 Oct, 2014 02:18 IST|Sakshi
నేటి పర్యటన వివరాలు

 సాక్షిప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో తుపాను బాధిత ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పర్యటించి, బాధితులను పరామర్శిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ప్రోగ్రామ్స్) తలశిల రఘురాం సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం పర్యటన బాగా ఆలస్యంగా కావడంతో సోమవారం రాత్రి పొద్దుపోయాక శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటిస్తారు.
 
 పర్యటన షెడ్యూల్:
 ఉదయం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి జగన్ బయలుదేరి అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకుంటారు.
 అక్కడి నుంచి పెద్దగ ణగళ్లవానిపేట చేరుకొని తుపాను బాధితులను పరామర్శిస్తారు.
 తరువాత శ్రీకాకుళం పట్టణంలోని కృష్ణాపార్కు వద్దనున్న తురాయిచెట్టు వీధిలోని వరదముంపు ప్రాంతాలను పరిశీలిస్తారు.
 మధ్యాహ్నం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అల్లినగరం జంక్షన్, బుడగట్లపాలెంతో పాటు, రణస్థలం మండలంలోని జీరుపాలెం, కోటపాలెం, పాతర్లపల్లి ప్రాంతాల్లోని తుపాను బాధితులను పరామర్శిస్తారు. అనంతరం జాతీయ రహదారి సమీపంలోని కోష్ట చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరుతారని పార్టీ నాయకులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు