నవరత్నాలతో అందరికీ మేలు

20 Sep, 2018 07:53 IST|Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవర్నాల పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని ఆపార్టీ నేతలు..ప్రజలకు వివరించారు. జిల్లాలో మూడో రోజు బుధవారం..‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.  పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నవరత్నాలతో కలిగే లక్షల రూపాయల లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నాయకుల అవినీతిని కూడా ఎండగడుతుండడంతో ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా నవరత్నాలతో ఎలా లబ్ధి చేకూరుతుందో వివరిస్తుండడంతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు.   

శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి.. కావాలి జగన్‌..రావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు బూత్‌ల్లో ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ అవినీతి, అక్రమాలను వివరించి ప్రజలను చైతన్య పరచారు.  

♦ పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్‌ మండలంలోని 34వ వార్డు చింతలముని నగర్‌లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి  పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు.  

♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి పాల్గొని నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  

♦ ఆలూరు నియోజవకర్గంలోని హాలహర్వి మండలం బి.చాకిబండ, దేవినేహాలు గ్రామాల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి నవరత్నాలు, టీడీపీ అవినీతి అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు శ్రీనివాసరెడ్డి, కల్యా గౌడ్, భీమస్ప చౌదరి పాల్గొన్నారు.  

♦ మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని జంపాపురంలో  ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొని టీడీపీ అవినీతి, అక్రమాలు, నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మురళీరెడ్డి, బెట్టనగౌడ్, ఇల్లూరి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.  

♦ నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం పసురుపాడులో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మల్కిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 

♦ ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామంలో పార్టీ నేత ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న., వెంకటరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.  

♦ పత్తికొండ నియోజకవర్గం దూదేకొండలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామంలో  భారీ బహిరంగసభ సభ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంచిపెట్టారు. అంతకముందు మెయిన్‌రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మద్దికెరలో కూడా నవరత్నాల కరపత్రాలను శ్రీదేవి ఆవిష్కరించారు.  

♦ ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలంలోని మహదేవపురంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు.  

కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల గ్రామంలో పార్టీ ఇన్‌చార్జ్‌ పరిగెల మురళీకృష్ణ ..నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. 

పేదరికం దూరమవుతుంది 
 నవరత్నాల పథకాలు అమలైతే సంవత్సరానికి ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. పేదరికం దూరమవుతుంది. ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పే వారిని నమ్మొద్దు. ముఖ్యంగా స్వార్థం కోసం పార్టీలు మారే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి లాంటి నేతలతో అప్రమత్తంగా ఉండాలి.  
– బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి 

మరిన్ని వార్తలు