ఘనంగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ వేడుకలు

13 Mar, 2019 12:20 IST|Sakshi
గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న నేతలు 

వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి 

జిల్లా వ్యాప్తంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

సాక్షి, పట్నంబజారు(గుంటూరు): యువజన, శ్రామిక, రైతు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించేందుకు వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి, కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఎన్నో పోరాటాలు, దీక్షలతో ప్రజా సమస్యలపై ప్రభుత్వాలలో చలనం తీసుకు వచ్చిన ఘనత వై.ఎస్‌.జగన్‌కు దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.

తాజామాజీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలన అందించాలంటే వై.ఎస్‌.జగన్‌ సీఎం కావాలన్నారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధే వై.ఎస్‌.జగన్‌ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదలించినా చంద్రబాబు సర్కార్‌ పాలనపై అసంతృప్తిగానే ఉన్నారన్నారు.

తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ జగన్‌ పథకాలను రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), డాక్టర్‌ కమ్మెల శ్రీధర్, పోలూరి వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 


జిల్లా వ్యాప్తంగా..
బాపట్ల నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ జెండా ఆవిష్కరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ కేక్‌ కట్‌ చేశారు.

నరసరావుపేటలో తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు జెండా ఆవిష్కరించారు.

వినుకొండ నియోజకవర్గంలో సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు కేక్‌ కట్‌ చేశారు. రేపల్లెలో మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదెవి వెంకటరమణ జెండా ఆవిష్కరించారు.

మంగళగిరి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జెండా కేక్‌లు కట్‌ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం కేక్‌ కట్‌ చేశారు. సత్తెనపల్లి నియోజవకర్గంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి జెండా ఆవిష్కరించారు.

తాడికొండ, గుంటూరు పార్టీ కార్యాలయాల్లో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉండవల్లి శ్రీదేవి,  డాక్టర్‌ కమ్మెల శ్రీధర్‌ పార్టీ జెండా కేక్‌ కట్‌ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో సమన్వయకర్త విడదల రజిని జెండా ఆవిష్కరించారు.  

గురజాల నియోజకవర్గంలో సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి జెండా ఆవిష్కరించారు. తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్‌ కేక్‌ కట్‌ చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో వేడుకలు నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు